twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి 'జయీభవ' అక్టోబర్ 1న

    By Staff
    |

    నందమూరి హారోల ముఖ్య అతిధుల సమక్షంలో 'జయీభవ" ఆడియో విడుదలకు సిద్దమౌతోంది. ' 'హరేరామ్', 'అతనొక్కడే' వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హ్యాట్రిక్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'జయీభవ'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

    ఈ సందర్భంగా హీరో నిర్మాత కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, అక్టోబర్ 1న 'జయీభవ' ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారనీ, పాటలన్నీ శ్రోతల్ని తప్పనిసరిగా ఆకట్టుకుంటాయన్న నమ్మకం నాకుందన్నారు. అక్టోబర్ మొదట్లోనే సినిమా విడుదలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. నరేష్ కొండేపాటి దర్శకుడిగా ఈ చిత్ర ద్వారా పరిచయమవుతున్నారు. కల్యాణ్ రామ్ కు జోడిగా హన్సిక మోత్వాని నటించిన ఈ చిత్రంలో ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, సుధ, హేమ, బెనర్జీ, వకీల్ ఖాన్ తదితరులు నటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X