క్లాస్, మాస్ ఆడియెన్స్ మెచ్చేలా.. అదిరిపోయిన ఎంత మంచివాడవురా టీజర్
Recommended Video
కొన్ని సినిమాలు వాటి పేర్లతోనే.. ఎంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటాయి. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంతమంచివాడవురా కూడా అదేకోవలోకి చెందుతుంది. ఆ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రాబోతొన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చేసింది.

మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు...
శతమానం భవతి సినిమాతో తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకున్నాడు సతీష్. ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా మలిచి.. అచ్చమైన తెలుగు సినిమాను చూసిన అనుభూతిని కల్పించాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించడం విశేషం. అయితే రెండో చిత్రంగా శ్రీనివాస కళ్యాణం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది.

హిట్స్ లేక వెనుకబడ్డ హీరో..
మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సరైన హిట్ లేక చాలా సతమతమవుతున్నాడు. పటాస్ తరువాత ఎన్ని సినిమాలు చేసినా.. మళ్లీ ఆ రేంజ్ హిట్టు కొట్టలేకపోతున్నాడు. రీసెంట్గా 118 అంటూ ఓ డిఫరెంట్ కథను ట్రై చేసినా ఫలితం అంతగా రాలేదు. మరి ఫ్యామిలీజానర్లో చేస్తోన్న ఈ సినిమా అయినా.. అతనికి విజయాన్ని చేకూరుస్తుందో లేదో చూడాలి.
అదిరిపోయిన టీజర్
తాజాగా ఈ మూవీ నుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మా మనవడు మంచి వాడు, మా అబ్బాయి మంచి వాడు, మా తమ్ముడు మంచివాడు, మా అన్నయ్య ఎంతో మంచివాడు.. మా బాబు ఎంతో మంచివాడు అంటూ టీజర్లో చెబుతూ ఉండగా.. అక్కడ విలన్లను చితక్కొడుతూ ఉంటాడు మన హీరో.. అందరూ మంచివాడు మంచివాడు అనిఅంటుంటే..ఇలా కొడుతున్నావేంటి? అని అడిగితే.. రాముడు మంచి వాడే..కానీ రావణుడి వేసేయలే అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ బాగుంది.. మళ్లీ ఎప్పుడొస్తావ్.. అని అంటే.. వచ్చే సంక్రాంతికి వస్తా అనే హింట్ ఇవ్వడం బాగుంది. మరి సంక్రాంతి బరిలో దిగి నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ తోట కెమెరామెన్ గా పనిచేస్తుండగా.. గోపీ సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











