Devil First Look నందమూరి ఫ్యాన్స్‌కు దసరా ట్రీట్.. కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ లుక్ వైరల్!
దసరా పండుగ సందర్బంగా నందమూరి అభిమానులకు కల్యాణ్ రామ్ కానుకను అందించారు. తాను నటించిన డెవిల్ సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అందించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా స్వీయం నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించి దర్శకత్వం వహించారు. దసరా పండుగ కానుకగా లుక్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
డెవిల్ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 24వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషనల్‌గా భాగంగా కల్యాణ్ రామ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానులకు పండుగ వాతావరణాన్ని కల్పించారు.

డెవిల్ మూవీ ఫస్ట్ లుక్‌లో గెడ్డంతో కనిపించిన కల్యాణ్ రామ్.. టెక్సెడో డ్రస్సులో ఆకట్టుకొన్నాడు. తన ఫస్ట్ లుక్ ద్వారా ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు వెల్లడించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకోండి. మీకు దసరా పండుగ సంతోషాన్ని, సానుకూల దృక్పథాన్ని కల్పించాలని కోరుకొంటున్నాను అని శుభాకాంక్షలు అందజేశారు.
డెవిల్ సినిమాలో దక్షిణాది నటి మాళవిక నాయర్, బాలీవుడ్ నటి ఎల్నాజ్ నరౌజీ నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా గాంధీ నడికుడికర్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం వేసిన సెట్స్, అనుసరించిన గ్రాఫిక్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని కలిగించనున్నాయి. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్ ఎస్, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

డెవిల్ సినిమాకు డైలాగ్ రైటర్ శ్రీకాంత్ విస్సా కథను, స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ సినిమా కథను గ్రిప్పింగ్‌గా ప్రేక్షకులకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











