ఇంట్రెస్టింగ్: ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. నందమూరి హీరో సినిమా హిట్ అయినట్లే.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న నందమూరి హీరోల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు దక్కించుకున్న నటుడు కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభంలో కొన్ని పరాజయాలను ఎదుర్కొన్న ఈ హీరో.. 'అతనొక్కడే'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత కూడా పలు ఫ్లాప్‌లు పలకరించినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'పటాస్'తో కల్యాణ్ రామ్ కెరీర్ మలుపు తిరిగింది. అక్కడి నుంచి వైవిధ్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఓ సినిమాతో సంక్రాంతి రేసులో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా చర్చ.? అసలేం జరుగుతోంది.?

అంతా మంచిగా సాగాలని కలిశాడు

అంతా మంచిగా సాగాలని కలిశాడు

నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవురా' అనే మూవీలో నటిస్తున్నాడు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయిక. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ మూవీ వస్తోంది.

మహేశ్, బన్నీకే పోటీగా దిగుతున్నాడు

మహేశ్, బన్నీకే పోటీగా దిగుతున్నాడు

ఈ సారి సంక్రాంతికి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ మూవీ ‘అల.. వైకుంఠపురములో' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే, రజినీకాంత్ ‘దర్బార్' కూడా అప్పుడే విడుదలవుతుంది. ఆ సమయంలోనే కల్యాణ్ రామ్ కూడా రాబోతున్నాడు. ‘ఎంత మంచివాడవురా' జనవరి 15న రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేస్తున్నాడు

జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేస్తున్నాడు

తన అన్న కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. తారక్ రాకతో తమ సినిమాకు క్రేజ్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ జనవరి 6, 7 తేదీల్లో జరిగే ఛాన్స్ ఉంది.

తెరపైకి వచ్చిన కొత్త సెంటిమెంట్

తెరపైకి వచ్చిన కొత్త సెంటిమెంట్

ఎప్పటి లాగే ఈ సంక్రాంతికి కూడా భారీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. గత నాలుగు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏమాత్రం అంచనాలు లేని సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. ‘శతమానం భవతి', ‘సోగ్గాడే చిన్ని నాయన', ‘ఎక్స్‌ప్రెస్ రాజా', ‘జై సింహా' సహా పలు చిత్రాలు హిట్ అయ్యాయి.

వాళ్లకు చాలా ప్రత్యేకమైనది

వాళ్లకు చాలా ప్రత్యేకమైనది

ఇక, సంక్రాంతి అంటే నందమూరి హీరోల సినిమాలకు పెట్టింది పేరు. గతంలో బాలయ్య ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ మధ్య కాలంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి', ‘జై సింహా' వంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో' కూడా సంక్రాంతికే వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే కల్యాణ్ రామ్ సినిమా కూడా హిట్ అవుతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X