Akhanda మూవీకి కల్యాణ్ రామ్ రివ్యూ: బాలయ్యపై నందమూరి హీరో ఊహించని కామెంట్స్

'గౌతమిపుత్ర' శాతకర్ణి తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ సక్సెస్‌ మాత్రం ఆయన దరి చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనకు గతంలో రెండు భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే చిత్రాన్ని చేశారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై నందమూరి కల్యాణ్ రామ్ రివ్యూ ఇచ్చాడు. ఆ సంగతులు మీకోసం!

‘అఖండ'గా మారిపోయిన బాలయ్య

‘అఖండ'గా మారిపోయిన బాలయ్య

సింహా, లెజెండ్ తర్వాత నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే.

కెరీర్‌లోనే భారీగా.. గ్రాండ్‌గా విడుదల

కెరీర్‌లోనే భారీగా.. గ్రాండ్‌గా విడుదల

క్రేజీ కాంబినేషన్ కావడంతో 'అఖండ' మూవీకి దాదాపు రూ. 53 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లో రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. అన్ని ప్రాంతాలను కలుపుకుని దీన్ని దాదాపు 1600లకు పైగా థియేటర్లలో తీసుకొచ్చారు. సెకెండ్ వేవ్ తర్వాత ఇది భారీ రిలీజ్.

పాజిటివ్ రివ్యూలు.. సూపర్ హిట్ టాక్

పాజిటివ్ రివ్యూలు.. సూపర్ హిట్ టాక్

ఎన్నో అంచనాల నడుమ వచ్చిన 'అఖండ' మూవీకి ప్రీమియర్ షోల నుంచే భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫ్యాన్స్ కోలాహలం నడుమ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. దీనికితోడు విమర్శకుల నుంచి ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు కూడా దక్కాయి.

కలెక్షన్ల సునామీ.. 2 రోజుల్లోనే 22 కోట్లు

కలెక్షన్ల సునామీ.. 2 రోజుల్లోనే 22 కోట్లు

సెకెండ్ వేవ్ తర్వాత భారీ స్థాయిలో విడుదలైన 'అఖండ' మూవీ బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా మొదటి రోజు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే, కేవలం రెండు రోజుల్లోనే రూ. 27 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో సగానికి సగం బిజినెస్ వచ్చేసింది. అంతేకాదు, కొన్ని ఏరియాల్లోనైతే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు కూడా చేరువ అయింది.

అఖండ మూవీపై కల్యాణ్ రామ్ రివ్యూ

అఖండ మూవీపై కల్యాణ్ రామ్ రివ్యూ

ఇండస్ట్రీకి సరైన సమయంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి 'అఖండ'తో భారీ విజయాన్ని అందించారు. దీంతో పరిశ్రమ మొత్తం హ్యాపీగా ఉంది. అదే సమయంలో ఈ చిత్రాన్ని ప్రముఖులంతా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రిలీజ్ రోజే జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీని చూసి ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు కల్యాణ్ రామ్ కూడా ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చేశాడు.

బాలయ్య.. బాలయ్య.. ఇరగదీశావయ్యా

బాలయ్య.. బాలయ్య.. ఇరగదీశావయ్యా

'అఖండ' సినిమాను వీక్షించిన నందమూరి కల్యాణ్ రామ్ తన ట్విట్టర్ ఖాతాలో 'బాలయ్య.. బాలయ్య.. ఇరగదీశావయ్యా.. అఖండ సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేశాను. బాబాయ్ ఫుల్ ఫోర్స్‌లో ఉన్నాడు. ఇండస్ట్రీకి సరైన సమయంలో భారీ విజయాన్ని అందించిన అఖండ చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్' అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X