ఫస్ట్ లుక్: కళ్యాణ్ రామ్ చిత్రానికి ‘118’ టైటిల్ ఫిక్స్... రిలీజ్ ఎప్పుడంటే!
నందమూరి కళ్యాణ్ ఈ సారి వెరైటీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి 118 అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 2019లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు.
కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతకు ముందు 'నా నువ్వే' అనే చిత్రాన్ని నిర్మించిన మహేష్ కోనేరు 'ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్' బేనర్లో 118 నిర్మించారు. సినిమాటోగ్రాఫర్‌గా సినీ ప్రేమికులకు సుపరిచితం అయిన కె.వి.గుహన్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నివేథా థామస్, షాలిని పాండే నటిస్తున్నారు. 'పటాస్' తర్వాత కళ్యాణ్ రామ్‌కు సరైన విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో వెరైటీ టైటిల్‌తో వస్తున్న 118 సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మరో వైపు కళ్యాణ్ రామ్ వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే 'ఎన్టీఆర్ బయోపిక్'లో తన తండ్రి హరికృష్ణపాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన రెండు వారాల తర్వాత 118 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











