టైటిల్ సమస్యలో కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం
కళ్యాణ్ రామ్, అభిమన్యు మల్లి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి హరే రామ హరే కృష్ణ అనే టైటిల్ ని అనుకున్న విషయం తెలిసిందే. అయితే కొంచెం అటూ ఇటూగా ఇలాంటి టైటిల్ తోనే రామ్ హీరోగా రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రం వచ్చింది. కానీ కళ్యాణ్ రామ్ తాను ఈ టైటిల్ కే ఫిక్స్ అయ్యానని మార్చటానికి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు దాదాపు పూర్తయిన ఈ చిత్రాన్ని మార్కెట్ చేసేటప్పుడు టైటిల్ సమస్యగా మారింది. టైటిల్ మారిస్తే కానీ చిత్రాన్ని తీసుకోవటానికి డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు ఆసక్తి చూపటం లేదని వినికిడి. ఎందుకంటే రామ్ సినిమా భాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవటం ఒక కారణమైతే, టైటిల్స్ సిమిలర్ గా ఉండటం ప్రేక్షకులను కన్ఫూజ్ చేస్తుందని భావిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే హరేరామ్ అంటూ కళ్యాణ్ రామ్..ఇంతకు ముందు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తీసిన చిత్రం కూడా ఆశించిన రీతిలో వర్కవుట్ కాకపోవటాన్ని కారణంగా చూపెడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్న మాటలకు కళ్యాణ్ రామ్ ఓకే అని సరైన టైటిల్ కోసం అన్వేషిస్తున్నారని సమాచారం. మంచి టైటిల్ దొరికి కళ్యాణ్ రామ్ కి పూర్వ వైభవం తెచ్చిపెట్టాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











