'ఎంత మంచి వాడవురా'.. బాబాయ్ హీరోయిన్‌‌తో కళ్యాణ్ రామ్ చిందులు

బాబాయ్ నందమూరి బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్‌తో కళ్యాణ్ రామ్ చిందులేస్తున్నాడు. అది కూడా ఐటెం సాంగ్‌లో. గత వారమే ఈ సాంగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 'ఎంత మంచి వాడవురా' సినిమాలో ఈ సాంగ్ థియేటర్స్‌ని హోరెత్తించనుంది.

బాల‌కృష్ణ హీరోగా వచ్చిన జైసింహా సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది న‌టాషా దోషి. ఈ అమ్మడితోనే ఇప్పుడు అబ్బాయ్ చిందులేస్తున్నాడు. 'ఎంత మంచి వాడవురా' సినిమాలో ఈ ఐటెం సాంగ్ హైలైట్ కానుందని అంటున్నారు యూనిట్ సభ్యులు.

Nandamuri Kalyan Rams New movie Entha Manchivaadavuraa Update

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథా చిత్రం 'ఎంత మంచి వాడవురా'. ఉమేష్ గుప్త సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది 17 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

గత చిత్రాల పరంగా చూస్తే ఇటు కళ్యాణ్ రామ్‌కి, అటు సతీష్ వేగేశ్నకు ఈ సినిమా ఎంతో ఇంపార్టెంట్ మూవీ. పెరుగుతున్న టెక్నాల‌జీ కార‌ణంగా దూర‌మ‌వుతోన్న మాన‌వ సంబంధాల‌ను ఎలివేట్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. సంక్రాంతి కానుకగా 'ఎంత మంచి వాడవురా' సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X