»   » కళ్యాణ్‌రామ్‌-తమన్నా మూవీ "నా నువ్వే" లేటెస్ట్ అప్డేట్స్

కళ్యాణ్‌రామ్‌-తమన్నా మూవీ "నా నువ్వే" లేటెస్ట్ అప్డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, అందాల భామ తమన్నా హీరోయిన్ గా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం లో రూపొందిన చిత్రం "నా.. నువ్వే".

    నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెలాఖరు లో విడుదల కు సిద్ధం అవుతోంది. ఈ బుధవారం ( ఏప్రిల్ 18) సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం లో ని తొలి పాట ప్రోమో ని చిత్ర బృందం విడుదల చేస్తోంది. "చినికి చినికి చిలిపిగాలి తడి తగిలి.... " అని సాగే ఈ పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది అని నిర్మాతలు తెలిపారు.

    Naa Nuvve

    "కళ్యాణ్ రామ్, తమన్నా ల కాంబినేషన్, ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతం, ప్రముఖకొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్యాలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణలు గా నిలుస్తాయి. ఈ పాట "నా.. నువ్వే" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది" అని నిర్మాత ల లో ఒకరైన కిరణ్ ముప్పవరపు తెలిపారు

    "ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. అయన కి ఈ చిత్రం ఒక టోటల్ మేకోవర్ ని ఇస్తుంది అని నమ్ముతున్నాం. ఈ బుధవారం విడుదల చేయబోయే పాట మా అందరికీ చాలా ఇష్టం అయిన పాట" అని సమర్పకులు మహేష్ కోనేరు తెలిపారు.

    లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు.

    ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ , ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర

    English summary
    Nandamuri Kalyan Ram and Tamannah are playing the lead roles in the romantic thriller ""Naa Nuvve", that has been directed by renowned ad film maker Jayendra. The movie's post production work has been completed and it is gearing up for a release in the last week of May. The promo of the first song from the film, titled "Chiniki Chiniki", will be released on Wednesday (18th April) at 5pm. This song is expected to be a special highlight of the film, according to the makers.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more