Akhanda: బాబాయ్‌పై అబ్బాయి ఊహించని ట్వీట్.. ఆ వీడియో షేర్ చేసి జై బాలయ్య అంటూ!
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. కెరీర్ ఆరంభం నుంచీ జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వెళ్తోన్న ఆయన.. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు. కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య సినిమాపై నందమూరి హీరో ఊహించని ట్వీట్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘అఖండ'గా వస్తున్న బాలకృష్ణ
నటసింహా నందమూరి బాలకృష్ణ.. బడా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమే 'అఖండ'. సింహా, లెజెండ్ తర్వాత వస్తున్న ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు.

ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రత్యేకంగా
హిట్ కోసం వేచి చూస్తోన్న బాలయ్య 'అఖండ' మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే దీని కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా నటిస్తున్నారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా దీన్ని ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.

రికార్డులు కొట్టేసి.. బజ్ పెంచేసి
'అఖండ' మూవీ నుంచి ఏది విడుదలైనా పేలిపోతోంది. గతంలో వచ్చిన ఫస్ట్ టీజర్‌తో పాటు టైటిల్ రోర్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తద్వారా సౌతిండియా రికార్డు బాలయ్య సొంతమైంది. ఇక, ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
Jai Balayya !!
— Kalyanram Nandamuri (NANDAMURIKALYAN) November 28, 2021
Babai in full flow !!
Can’t wait for the mass jathara in theaters from Dec 2nd.
- https://t.co/20SauR6e4E#Akhanda
గ్రాండ్‌గా ఈవెంట్.. బన్నీ రాకతో
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'అఖండ' మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ వేడుక మెగా, నందమూరి అభిమానులతో కళకళలాడిపోయింది.

బాబాయ్‌పై అబ్బాయి ట్వీట్ చేసి
నందమూరి బాలకృష్ణ సినిమా విడుదల అవుతుంటే ఆ కుటుంబానికి చెందిన హీరోలు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పలుమార్లు బాబాయ్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'అఖండ' సినిమాను ఉద్దేశించి ఆ ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు.
Recommended Video

వీడియో షేర్... జై బాలయ్య అని
'అఖండ' సినిమాలోని జై బాలయ్య అంటూ సాగే పాట వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన నందమూరి కల్యాణ్ రామ్ 'జై బాలయ్య.. బాబాయ్ మాంచి ఊపులో ఉన్నాడు. ఈ మాస్ జాతరను చూసేందుకు డిసెంబర్ 2 వరకూ వేచి చూడలేకపోతున్నా' అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో నందమూరి అభిమానులు దీన్ని రీట్వీట్లు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











