ఆర్నెళ్లుగా మోక్షజ్ఞ అక్కడే అడ్డా.. బాలయ్య డిసైడ్ చేస్తేనే..!

టాలీవుడ్‌లో నందమూరి వారసులకు కొదవేం లేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నుంచి తారకరత్న వరకు హీరోల జాబితా ఘనంగా ఉంది. అయితే త్వరలోనే బాలకృష్ణ వారసుడిగా కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు బాగానే వినిపించాయి. అయితే ఆయన ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్ అందని ద్రాక్ష మాదిరిగానే అనిపిస్తున్నది. ఎప్పుడెప్పుడా అని ఓ ఆసక్తికరమైన వార్త కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ గురుంచి ఓ వార్త మీడియాలో క్రేజీగా మారింది. అదేమిటంటే..

మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాలుగా

మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాలుగా

నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ‌పై టాలీవుడ్‌లో రకరకాల వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నాడని, ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆయన ఎంట్రీ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అయితే సరైన సమయం కోసం బాలకృష్ణ వేచి చూస్తున్నారని సమాచారం.

కాఫీ షాప్‌లో అడ్డా పెట్టి

కాఫీ షాప్‌లో అడ్డా పెట్టి

ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఫ్రెండ్స్‌తో కలిసి ఫిలింనగర్‌లోని ఓ కాఫీ షాప్‌లో అడ్డా పెడుతున్నారట. స్నేహితుల సమూహంతో ఆయన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెల్లడించింది. అయితే ఆర్నెళ్లుగా అదే కాఫీ షాప్‌లో రెగ్యులర్‌గా కొన్ని గంటలపాటు కాలక్షేపం చేయడం పలువరి దృష్టిలో పడింది.

 మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ

సెలబ్రిటీ పిల్లలో మోక్షజ్ఞ ఒకే ప్రదేశంలో కలిసి ఉండటంతో ఇప్పట్లో ఆయన సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి అవకాశం లేదనిపిస్తున్నదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. ఇంకా ఆయన ఎంట్రీకి చాలా సమయం ఉండటం కారణంగానే మోక్షజ్ఞ ప్రస్తుతం సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై ఇక బాలకృష్ణనే సమాచారం అందిస్తే ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు.

రూలర్ చిత్రంతో బాలయ్య

రూలర్ చిత్రంతో బాలయ్య

కాగా, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా రూలర్ అని ఖారారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X