Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్మార్ట్ లుక్‌లో అదరగొడుతున్న నందమూరి మోక్షజ్ఞ..లేటెస్ట్ లుక్ వైరల్!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. నందమూరి అభిమానులంతా 2019లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని భావించినా ఈ ఏడాది అది జరిగేలా లేదు. మోక్షజ్ఞ నటన, డాన్సులు, ఫైట్స్ ఇలా హీరోకి కావలసిన అన్ని అంశాలపై శిక్షణ పొందుతున్నాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అయిన తరువాతే సినిమా ప్రారంభించాలని బాలయ్య భావిస్తున్నాడట. తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ లుక్ ఇదే
ఇటీవల కాలంలో స్టార్ వారసుడిగా టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో అక్కినేని అఖిల్. ఆ తర్వాత అభిమానులు అంతగా ఎదురుచూస్తున్నది బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కోసమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు అంతగా ఎదురుచూస్తుంటే.. అతడు మాత్రం రహస్యంగా, కనీసం ఫొటోలో కూడా కనిపించకుండా తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మోక్షజ్ఞ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇదే మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్.
స్మార్ట్‌గా ఉన్నాడు
కాస్త గడ్డం పెంచి, కళ్ళజోడు ధరించిన మోక్షజ్ఞ స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. గతంలో మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉన్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ కోసమో ఏమో కానీ స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. ఒక్క సినిమా కూడా చేయక ముందే నందమూరి అభిమానులు మోక్షజ్ఞని యంగ్ లయన్ అంటూ ముద్దుగా పిలిచేస్తున్నారు. నందమూరి ఫ్యామిలిలో ఎన్టీఆర్ తర్వాత బాలయ్య, ఆ తర్వాత జూ, ఎన్టీఆర్ మాస్ హీరోలుగా ఎదిగారు. మరి మోక్షజ్ఞ హీరోగా ఎలాంటి సంచలనాలు చేస్తాడో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.
మోహన్ బాబు చివర్లో ఎన్టీఆర్‌ని వదిలేసి .. అమాయకత్వంతో చేసినా తప్పే.. లక్ష్మీపార్వతి!
భారీ అంచనాలు
మెగా ఫ్యామిలీలో చిరు, పవన్ తరం తర్వాత రాంచరణ్ ఎంట్రీ పదేళ్ల క్రితమే జరిగింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొకరుగా ఎంట్రీ ఇస్తూ వచ్చారు. అక్కినేని కుటుంబంలో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్పుడే మూడు చిత్రాల్లో కూడా నటించాడు. కానీ నందమూరి ఫ్యామిలిలో జూ. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకునే హీరో రాలేదు. కానీ మోక్షజ్ఞపై మాత్రం అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
బాలయ్యకు తెలుసు
తన తనయుడి సినీరంగ ప్రవేశం అంటే అభిమానుల్లో ఎంత క్రేజ్ నెలకొని ఉంటుందో బాలయ్యకు తెలుసు. అందుకే మోక్షజ్ఞ అన్ని విధాల సిద్ధం అయ్యేవరకు, మంచి కథ దొరికేవరకు సినిమా ప్రారంభించేది లేదనే ఉద్దేశంతో బాలయ్య ఉన్నాడు. మోక్షజ్ఞ ప్రస్తుతం విదేశాల్లో హార్స్ రైడింగ్, ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.