CBN Arrest: చంద్రబాబు అరెస్టు.. NTR కుమారుడు కన్నీటి పర్యంతం

చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రజలందరి ఆశీస్సులు తమ కుటుంబానికి కావాలని కంటతడిపెట్టారు. తన సోదరి భువనేశ్వరితో కలిసి ఈరోజు సెప్టెంబర్ 9న ఆయన విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. బాబును మరోసారి సీఎం చేసి ఏపీని మళ్లీ నెం.1 చేద్దామని పిలుపునిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇక టీడీపీ శ్రేణులు అక్రమ అరెస్టులు అంటూ ఆరోపణలు చేస్తుండగా వైసీపీ శ్రేణులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈయన అరెస్టుపై పలువురు రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు.

Nandamuri RamaKrishna

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇది అప్రజాస్వామిక అని పేర్కొన్నారు. ఈ అరెస్టు అప్రజాస్వామ్యక ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందన్నారు. రాజకీయ సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలను అణిచివేయాలనే వైసీపీ ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు.

ఇక బాబు అరెస్టుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా రియాక్ట్ అయ్యారు. విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారిని ఇవాళ నారా భువనేశ్వరి దర్శించుకుని దర్శించుకున్నారు. ఇక ఆమెతో ఉన్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూనే కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని కాపాడే హక్కు అందరికీ ఉంది. ఇప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ ఎమోషనల్ అయ్యారు.

మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న విషయం. చంద్రబాబు గారిని రాత్రికి రాత్రే 2021 లో ఉన్న కేసులో అరెస్టు చేయడం చాలా అన్యాయం. ఇదంతా జగన్ చేస్తున్న దగా, మోసం. పగ తీర్చుకున్నట్టు అనిపిస్తుంది. బాబు ఎంత కష్టపడ్డారో తెలుగు వారందరికీ తెలుసు. ముఖ్యమంత్రి ఆంధ్రాను వదిలేసి హాయిగా విదేశాల్లో తిరుగుతున్నారని ఆరోపణలు చేశారు.

రామకృష్ణ మాట్లాడుతూ... మళ్లీ మనం బాబును గెలిపించుకుందాం. ఏపీని మొదటి స్థానంలో పెట్టి అభివృద్ధి చేసుకుందాం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ బాధలు చెప్పుకోవడానికి దుర్గమ్మను దర్శించుకున్నాను అని చెప్పింది. బాబును రక్షించాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు పోరాడుతున్నారని ఆయనకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఇక చంద్రబాబుకు మనోధర్యం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు భువనేశ్వరి వెల్లడించింది. రాష్ట్ర శ్రేయస్సు కోసమే చంద్రబాబు పోరాటం చంద్రబాబుకు ప్రజల మద్దతు ఉంది. చేయి చేయి కలిపి చంద్రబాబుని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X