»   » ‘నందమూరి శిఖరం’...బాలయ్య‌‌పై జగన్ పుస్తకం

‘నందమూరి శిఖరం’...బాలయ్య‌‌పై జగన్ పుస్తకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ త్వరలో 100 సినిమాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 'నందమూరి శిఖరం' పేరుతో 1000 పేజీల పుస్తకం రూపకల్పనకు యన్.బి.కె. హెల్పింగ్ హాండ్స్ శ్రీకారం చుట్టింది. బాలయ్యతో సినీ ప్రముఖులు, ఆత్మీయులు, కుటుంభసభ్యుల అనుబంధాన్ని ఈ పుస్తకం రూపంలోకి తెస్తున్నారు.

యన్.బి.కె. హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు అనంతపురము జగన్ మాట్లాడుతూ ‘14 ఏళ్ళ వయస్సులో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అన్న యన్.టి.ఆర్. వారసుడిగా తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమై క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభతో అంచలంచెలుగా ఎదిగి, తండ్రికి తగ్గ తనయుడుగా అన్ని రకాల పాత్రలు పోషించి 40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ విశ్వవ్యాప్తంగా నటవారసుడిగా శత చిత్రాలు పూర్తి చేసుకోబోతున్న తొలి తెలుగు అగ్ర కథానాయకుడిగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్న శుభ సంధర్బంగా మహా మనిషి కోసం తమవంతు బాధ్యతగా ఈ పుస్తక రూపకల్పనకు శ్రీకారం చుట్టాము' అన్నారు.

'Nandamuri Shikaram': A Book about Balakrishna

కళారాధన తోనే జీవన సాఫల్యం అందుకొంటూ రంగం ఏదైనా తన తండ్రి యన్.టి.అర్. అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకు వెళ్తూ అభిమానులు, ప్రేక్షకుల దీవెనలతో బహుముఖ సేవలను అందిస్తూ, ఎంతో సాధించినా - ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అను నిత్యం శ్రమిస్తూ అందరితో మమేకం అవుతూ , ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ, సమాజానికి, సినీ పరిశ్రమకు, తన వంతు బాద్యతగా బహుముఖ సేవలు అందిస్తున్న బాలయ్య గారి అపరూపమైన వ్యక్తిత్వం గురించి సినీ ప్రముఖులు , ఆత్మీయులు, కుటుంబసభ్యులు స్వహస్తాలతో రాసిన 'హృదయ స్పందన ' ను ఆవిష్కరించే అరుదైన ప్రయత్నం చేస్తున్నామని జగన్ తెలిపారు. ఈ నందమూరి శిఖరం పుస్తకం బాలకృష్ణ గారి 'కీర్తి కిరీటం' లో కలికితురాయి కానుంది.
బాలయ్య నట విశ్వరూపాన్ని, సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన అందిస్తున్న ప్రశంసనీయమైన సేవలను తెలుపే ఈ వెయ్యి పేజిల పుస్తకం రూపకల్పన పనులను ఇప్పటికే ప్రారంభిచామని , బాలయ్య శత చిత్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించామని అనంతపురము జగన్ తెలిపారు.

ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ జీవిత సహచరిణి వసుంధర స్వహస్తాలతో రాసిన తన హృదయ స్పందనను పుస్తక రూపకర్త అనంతపురం జగన్ కు అందజేశారు. అనంతపురం జగన్ మాట్లాడుతూ సేవాగుణంలో తనకు బాలయ్యే స్పూర్తి అని, ఆయన ఆశీస్సులతోనే యన్.బి.కే. హెల్పింగ్ హాండ్స్ స్థాపించి, జాతీయ స్థాయిలో సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 'నందమూరి శిఖరం ' పుస్తక రూపకల్పనకు తనకు అవకాశం కల్పించినందుకు స్పూర్తి ప్రదాత బాలయ్యకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.

English summary
Nandamuri Shikaram, a book released on Nandamuri Balakrishna's life relesed.
Please Wait while comments are loading...