బాల బాబాయ్ సూపర్: ‘ఎన్టీఆర్-కథానాయకుడు’పై నందమూరి సుహాసిని
'ఎన్టీఆర్-కథానాయకుడు' చిత్రాన్ని నందమూరి సుహాసిని ఎఎంబి సినిమాస్ థియేటర్లో బాలయ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ సంర్భంగా ఆమె సినిమాపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు.
తాతగారి గురించి నాకు తెలియని చాలా వాస్తవాల గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకున్నట్లు నందమూరి సుహాసిని తెలిపారు. తాతగారిలా బాల బాబాయ్, నాన్నగారిలా కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారని ఆమె తెలిపారు.

దర్శకుడు క్రిష్ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా బావుందని, సినిమా అందరూ చూసి విజయానికి తోడ్పడాలని కోరారు. బాల బాబాయ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఆయన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలో దాదాపు 1000 స్క్రీన్లలో 'ఎన్టీఆర్-కథానాయకుడు' ప్రదర్శింపబడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











