Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్‌లో అలాంటి సమస్య

ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులతోపాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పలు ట్వీట్స్ కూడా చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన తారకరత్నకు గుండెపోటు అని వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హెల్ట్ అప్డేట్ వెల్లడించారు.

గుండెపోటుగా నిర్ధారణ..

గుండెపోటుగా నిర్ధారణ..

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టే క్రమంలో గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో హీరో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.

కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన పార్టీ కార్యకర్తలు ఆయనను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడి నుంచి పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

కీలక విషయాలు..

కీలక విషయాలు..

ప్రస్తుతం నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. అందులో తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నట్లు వెల్లడించారు. అలాగే తారకరత్నకు చేసిన సిటీ స్కాన్ రిపోర్టులో వైద్యులు పలు కీలక విషయాలు గుర్తించినట్లు సమాచారం.

ఆయనకు తక్కువ ఆక్సిజన్ అందడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై వైద్య నిపుణులు పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హాస్పిటల్ లోని ఐసీయూలో తారకరత్న చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి బయటకు లీక్ అయింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అభిమానుల ట్వీట్స్, కామెంట్స్..

అభిమానుల ట్వీట్స్, కామెంట్స్..

వెంటిలేటర్ పై ఉన్న తారకరత్నను చూసి అభిమానులు తల్లడిల్లిపోయారు. "నిన్ను అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నా.. త్వరగా కోలుకుని తిరిగి రా అన్నా" అంటూ కామెంట్స్, ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి, నారా కుటుంబ సభ్యులు అయిన చంద్రబాబు, బాలయ్య బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యంపై వారు వైద్యులను అడిగి ఆరా తీశారు. వైద్యులు కూడా ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X