పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటూ నందమూరి తారక రత్న ఆసక్తికర వ్యాఖ్యలు.. పోటీనే కాదంటూ!

సాధారణంగా పైకి ఎన్ని చెప్పినా సరే మెగా నందమూరి కుటుంబాల మధ్య గట్టిపోటీ ఎప్పటినుంచో ఏర్పడి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్య రామ్ చరణ్ -ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేయడంతో కొంత మేరకు ఆ అభిమానులు కలిసి ఉంటే కనిపించినా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎంత దూరం వెళ్లాయి అనే విషయం కూడా దాదాపు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు నందమూరి హీరో పవన్ కళ్యాణ్ బాబాయ్ అని సంబోధించడం ఆసక్తికరంగా మారింది. అయితే నందమూరి హీరో ఎందుకు అలా సంబోధించాడు? ఏమిటి ఆ సందర్భం అనే వివరాల్లోకి వెళితే

హీరోగా నిలబడ లేక

హీరోగా నిలబడ లేక


నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మనవడు తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాగా ఆడడంతో ఆయనకు కెరీర్ ప్రారంభంలోనే వరుస అవకాశాలు దక్కాయి. సరైన సినిమాలు ఎంచుకోక పోవడంతో దాదాపు ఆయన నటించిన అన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నిలబడ లేక పోయాడు.

 ఎన్టీఆర్ తరువాతే

ఎన్టీఆర్ తరువాతే


అయితే ఆ మధ్య విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు తాజాగా ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ కు పోటీగా తారకరత్న నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దించిందనే ప్రచారం జరిగింది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారో అని అడిగితే తమ్ముడు ఎన్టీఆర్ తరువాతే తాను సినిమాల్లోకి వచ్చానని తారకరత్న చెప్పుకొచ్చారు.

 తనకేమీ తెలియదని

తనకేమీ తెలియదని


అప్పటికే ఎన్టీఆర్ ఆది ఇలాంటి హిట్ సినిమాలు ఇచ్చాడు కానీ తన కెరీర్ ప్రారంభం కాలేదు కాబట్టి తాను ఎన్టీఆర్ కి ఒక పోటీ కాదని చెప్పుకొచ్చారు. హీరో అవ్వాలనేది తన కల అని చెప్పిన ఆయన దానికి తన తండ్రి, బాబాయ్ సపోర్ట్ చేసి ముందుకు నడిపించారని చెప్పారు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందని పేర్కొన్న తారకరత్న 2024లో జనసేన, టీడీపీ పొత్తుల గురించి తనకేమీ తెలియదని అన్నారు.

 పవన్ బాబాయ్

పవన్ బాబాయ్


తనకు ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలనే తపన మాత్రమే ఉందని రాజకీయాల గురించి అవగాహన లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తుల వ్యవహారం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ఆయన బాబాయ్ అని సంబోధించారు. పవన్ బాబాయ్ ప్రజల కోసం కష్టపడుతున్నారని ఆయన స్థాయిలో ఆయన పని చేస్తున్నారని తారకరత్న అన్నారు.

పోటీ లాగా అనిపించడం

పోటీ లాగా అనిపించడం


చిన్నప్పటి నుంచి తాను పవన్ కళ్యాణ్ సినిమాలు చూశానని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ లాగా అనిపించడం లేదని అన్నారు. తాను బాబాయ్ బాలకృష్ణ, అన్న జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ కోసమే పని చేస్తామని చంద్రబాబు సూచనల మేరకు ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X