Taraka Ratna హోటల్ కూల్చివేత.. మందు తాగి న్యూసెన్స్.. అసలు ఏం జరిగిందంటే?
ఇటీవల నందమూరి తారకరత్న మరణం యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. సినిమాల్లో హీరోగా, విలన్ గా అలరించి.. రాజకీయాల్లోకి అడుగుపెడదామనుకుని ఊహించని విధంగా ఆయన గుండెపోటుతో మరణించడం కుటుంబీకులు, అభిమానులు ఇంకా జీర్మించుకోలేకపోతున్నారు. జనవరి 27న గుండెపోటుతో హాస్పిటల్ చేరిన ఆయన 23 రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే నందమూరి తారకరత్న మరణించినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తారకరత్న పెట్టిన ఒక రెస్టారెంట్ మధ్యలో కూల్చివేతకు గురైంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

విలన్ గా నంది అవార్డు..
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఘనంగా తెరంగేట్రం చేశారు నందమూరి తారకరత్న. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత హీరోగా అంతగా విజయాలు చూడని తారకరత్న విలన్ గా కూడా నటించి అలరించారు. రవిబాబు దర్శకత్వం వహించిన అమరావతి సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు గానూ నంది అవార్డు సైతం అందుకున్నారు.

ఊహించని విధంగా..
అంతేకాకుండా నారా రోహిత్ హీరోగా నటించిన రాజా చేయి వేస్తే సినిమాలో కూడా విలన్ గా నటించారు తారకరత్న. ఇలా హీరోగా, విలన్ గా సుమారు 23 చిత్రాల్లో నటించిన నందమూరి తారకరత్నకు ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అదే కాకుండా మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా.. కుప్పంలోని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఊహించని విధంగా గుండెపోటుకు గురయ్యారు.

అలేఖ్య రెడ్డితో పెళ్లి తర్వాత..
బెంగళూరులో అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్స పొందినప్పటికీ తారకరత్న మరణించారు. ఇక ఫిబ్రవరి 20న సాయంత్రం మహా ప్రస్థానంలో కన్నీటీ వీడ్కోలుతో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మరణాన్ని ఫ్యామిలీ మెంబర్స్, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులో చనిపోవడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే అలేఖ్య రెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్న తర్వాత కుటుంబానికి కాస్తా దూరమయ్యారని టాక్.

తారకరత్నకు పలు బిజినెస్ లు..
తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందునే దూరం కాగా.. మళ్లీ ఫ్యామిలీతో కలిసేందుకు తారకరత్నకు నాలుగేళ్లు పట్టిందట. ఈ సమయంలోనే తండ్రి మోహనకృష్ణ ఆస్తి మొత్తాన్ని తారకరత్న సోదరి రూప పేరు మీద రాశారాని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు చెందాల్సిన ఆస్తిపై చర్చ నడుస్తోందని సమాచారం. కాగా సినిమాల్లో పెద్దగా రాణించని తారకరత్నకు బిజినెస్ లు ఉన్నట్లు టాక్. అయితే ఆయనకు సంబంధించిన హోటల్ ను గతంలో కూల్చివేశారనే విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది.

సమస్య ఏంటని ప్రశ్నిస్తే..
నందమూరి తారకరత్నకు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కబరా డ్రైవ్ ఇన్ (Kabara Drive In) పేరుతో ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ ను 2019లో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. సిబ్బంది అడ్డుకున్నప్పటికీ కొంత భాగం కూల్చేశారట. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న వెళ్లి సమస్య ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా.. రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారట.

వేరొక చోటుకి రెస్టారెంట్..
అంతేకాకుండా రెస్టారెంట్ లో లిక్కర్ కూడా సప్లయ్ చేస్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని కొందరు కంప్లయింట్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారని సమాచారం. అలా సడెన్ గా రెస్టారెంట్ ను కూల్చివేతకు అధికారులు సిద్ధం కావడంతో.. అక్కడి ఫర్నిచర్, మెటీరియల్ ను షిఫ్ట్ చేసేందుకు వారితో చర్చించి తారకరత్న కొంత సమయం తీసుకున్నారట. తర్వాత ఆ రెస్టారెంట్ ను వేరొక చోటుకు మార్చారట. అయితే అప్పట్లో ఈ విషయం మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











