Taraka Ratna Passed away అంత్య క్రియలు ఎప్పుడు? ఎక్కడ?
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన పాత్రలు, తనదైన నటనతో ఆకట్టుకొన్న నందమూరి తారకరత్న ఇకలేరు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై ఉన్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన మృతిపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
బెంగళూరులో తుదిశ్వాస విడిచిన తారకరత్నను ఆదివారం ఉదయం హైదరాబాద్ నగర శివారులోని మోకిలాలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి ఉదయం అంటే.. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం చాంబర్‌లో ప్రజలు, అభిమానులు, సహచర నటీనటులు సందర్శనార్థం ఉంచుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తారకరత్న దాదాపు 23 చిత్రాల్లో నటించారు. మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవల టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్బంగా కుప్పం ప్రాంతానికి వెళ్లిన తారకరత్న అక్కడే కుప్పకూలాడు. దాంతో ఆయనను కుప్పంలోని స్థానిక హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అనంతరం బెంగళూరు నారాయణ హాస్పిటల్‌కు మెరుగైన చికిత్స కోసం తరలించారు.


Click it and Unblock the Notifications











