twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారకరత్న చేసిన మిస్టేక్ అదే.. ఐసియూలో స్టంట్ వేసిన వైద్యులు.. పరిస్థితి ఎలా ఉందంటే..

    |

    లోకేష్ పాదయాత్ర కొనసాగుతూ ఉండగా హఠాత్తుగా అందులో తారకరత్న ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని వైద్యులు చెబుతున్నారు. కానీ తారకరత్న కార్డియక్ అరెస్ట్ కావడం వలన కొంత ప్రమాదం కూడా పొంచి ఉంది అని అయితే పరిస్థితి 24 గంటల్లో గడిస్తే గాని చెప్పలేము అని మరి కొంతమంది వైద్యులు తెలుపుతున్నారు. ఇక తారకరత్నకు హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణం ఏమిటి అలాగే ఆయన చేసిన పొరపాటు ఏమిటి అనే విషయంలో కూడా కొంతమంది వైద్యులు వారి వివరణ ఇస్తున్నారు.

    హడావిడిగా కొనసాగుతున్న సమయంలో..

    హడావిడిగా కొనసాగుతున్న సమయంలో..

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల తన పాదయాత్రను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే కుప్పం నుంచి స్టార్ట్ కాగా అందులో చాలామంది నందమూరి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఇంత హడావిడిగా కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా తారకరత్న కింద పడిపోయాడు. దీంతో కొంతసేపటి వరకు కార్యకర్తలకు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే ఆయనను వాహనంలో సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

     శరీరం ఒక్కసారిగా బ్లూగా మారిపోయింది

    శరీరం ఒక్కసారిగా బ్లూగా మారిపోయింది

    అయితే ఆసుపత్రికి వచ్చినప్పటికీ తారకరత్నకు ఎలాంటి పల్స్ లేవు. ఇక శరీరం ఒక్కసారిగా బ్లూ గా మారిపోయింది. వెంటనే ఆయనకు ట్రీట్మెంట్ అందించిన వైద్యులు 45 నిమిషాల తర్వాత పల్స్ మొదలైనట్లు గమనించారు. మొదట ఆయన అపస్మార్క స్థితిలో ఉండడంతో అందరూ కూడా కంగారుపడ్డారు. కానీ వైద్యులు వెంటనే చికిత్స అందించి గుండె పని చేసే విధంగా చేశారు. ప్రస్తుతం ఐసియు లో ఉన్న తారకరత్న కు స్టెంట్ వేశారు.

    మొదట పట్టించుకోలేదు

    మొదట పట్టించుకోలేదు

    అయితే ఈ పాదయాత్రలో అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో తారకరత్న కూడా అందరితోపాటు చలాకీగా పాల్గొన్నారు. కొంత గుండెల్లో నొప్పి రావడంతో మొదట ఆయన దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత దాని తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలి పోవాల్సి వచ్చింది.

     అప్పుడే జాగ్రత్తపడి ఉంటే..

    అప్పుడే జాగ్రత్తపడి ఉంటే..

    అయితే ప్రస్తుతం వైద్య నిపుణులు చెబుతున్న దాన్నిబట్టి తారకరత్న గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి ఉంటే పరిస్థితి చాలా తొందరగా అదుపులోకి వచ్చేది. బహుశా ఆయన చిన్నదే అనుకొని దానిని పట్టించుకోకపోవడం వలన కార్డియక్ అరెస్ట్ వరకు వెళ్లి ఉండవచ్చు అని అంటున్నారు. అంతేకాకుండా 45 నిమిషాల తర్వాత పల్స్ తెలిసింది అంటే గొప్ప విషయమే కావచ్చు. కానీ అది కూడా కాస్త ప్రమాదం అని కూడా చెప్పవచ్చు అని చెబుతున్నారు.

    24 గంటలు గడిస్తే..

    24 గంటలు గడిస్తే..

    కార్డియాక్ అరెస్టు రావడంతో బ్రెయిన్ పై చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఆయన కోలుకున్న తర్వాత కూడా మళ్ళీ గుండెల్లో నొప్పి రావచ్చు. అందుకే ఆయన పరిస్థితి 24 గంటలు తర్వాత గడిస్తే గాని చెప్పడానికి వీలు ఉండదు అని మరికొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అంత పెద్ద వయసు ఏమీ కాదు కాబట్టి తారకరత్న ఈ కార్డియాక్ అరెస్టు నుంచి వీలైనంత తొందరగా కూడా కొలుకోవచ్చు అని మరికొందరు చెబుతున్నారు.

    English summary
    Nandamuri taraka ratna latest health update and doctor's clarifications
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X