Taraka Ratna: మొదటిసారి తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. అలాంటి ఫొటో షేర్ చేస్తూ..

నందమూరి హీరో తారక రత్న ఇటీవల కన్నుమూయడం వారి కుటుంబాన్ని ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టివేసింది. ముఖ్యంగా అతని భార్య పిల్లలు కూడా తారకరత్నను కోల్పోవడం చాలా బాధకు గురి చేసింది. ఇక తారకరత్న మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటిసారి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఇక ఆమె ఒక ప్రత్యేకమైన రోజున గుర్తు చేసుకుంటూ తన భర్తకు విషెస్ అందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

కలచివేసిన ఘటన

కలచివేసిన ఘటన

నటుడిగా రాజకీయ నాయకుడిగా సరికొత్తగా అడుగులు వేయాలని అనుకున్న తారకరత్న హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను అలాగే నందమూరి అభిమానులను ఈ ఘటన ఎంతగానో కలచివేసిందే. ఇక తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

 తీరనిలోటు

తీరనిలోటు

ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 39 ఏళ్ల వయసులో కార్డియక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందడం ఆ కుటుంబాన్ని ఎంతగానో మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అలాగే వారి ముగ్గురు పిల్లలు కూడా ఇది తీరని లోటు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏమాత్రం బాధపడకుండా

ఏమాత్రం బాధపడకుండా

ఇక తారకరత్న, అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వారి గురించి అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తారకరత్న అలేఖ్యరెడ్డిని ఇష్టంగా ప్రేమ వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా కొనసాగాడు. కొన్నాళ్లు కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా తారకరత్న ఏమాత్రం బాధపడకుండా అలేఖ్యరెడ్డిని ఎంతో సంతోషంగా చూసుకున్నాడు.

సవ్యంగా కొనసాగుతున్న సమయంలోనే..

సవ్యంగా కొనసాగుతున్న సమయంలోనే..

ఇక ముగ్గురు పిల్లలు జన్మించిన తర్వాత మళ్ళీ అందరి కుటుంబ సభ్యులతో జీవించే సందర్భం వచ్చింది. అంతా సవ్యంగా కొనసాగుతున్న సమయంలోనే తారకరత్న కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ఇక ఇటీవల తారకరత్న అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే. చిన్న కర్మ రోజు కూడా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్త ఫోటోను చూసి ఎంతగానో ఏడ్చింది.

పుట్టినరోజు కావడంతో..

పుట్టినరోజు కావడంతో..

ఇక ఏప్రిల్ 22వ తేదీన తారకరత్న పుట్టినరోజు కావడంతో ఆ విషయం కూడా వారిని మరింత మనోవేదనకు గురి చేసింది. ప్రతి పుట్టినరోజు కుటుంబ సభ్యులతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న తారకరత్న ఇప్పుడు వారి మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోయారు. ఇక సోషల్ మీడియాలో అలేఖ్య రెడ్డి మొదటిసారి తారకరత్నకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ తన ప్రేమను షేర్ చేసుకునే.

ఎమోషనల్ పోస్ట్

హ్యాపీ బర్త్ డే బెస్ట్ ఫాదర్.. బెస్ట్ హస్బెండ్.. అలాగే ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. లవ్ యు సో మచ్.. అంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తన కూతురితో ఉన్న ఫోటోను కూడా ఆమె అందులో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X