Tarakaratna బెస్ట్ యాక్టర్ అనడానికి ఈ ఒక్క సీన్ చాలు.. ప్రాణం పెట్టేశాడు..
ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న హఠాత్తుగా కన్నుమూయడం నందమూరి కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా వారి అభిమానులను కూడా ఎంతగానో బాధకు గురిచేస్తోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగు వేస్తున్న తారకరత్న హఠాత్తుగా మరణించడం వారి కుటుంబాన్ని ఒక్కసారిగా విషాదంలోకి నెట్టివేసింది. అయితే తారకరత్నకు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తారకరత్న మంచి నటుడు అని చెప్పడానికి ఒకే ఒక్క సీన్ చాలు అని వారి అభిమానులు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

బాలకృష్ణ ఎంతో ఇష్టంగా..
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నట వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ చాలా బలంగా కొనసాగించాడు. నటుడిగా నందమూరి స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లిన బాలకృష్ణ ఆ తర్వాత ఎంతో ఇష్టంగా తన అన్నయ్య కుమారుడు తారకరత్నను కూడా ఇండస్ట్రీకి గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకున్నాడు. ఇక అందుకు తగ్గట్టుగానే ఒకేరోజు 9 సినిమాలను లాంచ్ చేయించారు.

వెనక్కి తగ్గకుండా ప్రయత్నాలు
అయితే తారకరత్న మొదట్లోనే తొమ్మిది సినిమాలకు సంతకం చేసినప్పటికీ కూడా అందులో ఒక నాలుగు ఐదు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మరికొన్ని చర్చల దశలోనే ఆగిపోయాయి. అయినప్పటికీ కూడా అతను ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తారకరత్న తన ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోలేదు. ఏదో ఒక భిన్నమైన ప్రయోగాలు చేస్తూ మంచి యాక్టర్ ఇండస్ట్రీలో కొనసాగాలని అనుకున్నాడు.
సైకోగా ఏడిపించిన తారకరత్న
అయితే హీరోగా తారకరత్న అనుకున్నంత స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలను అందుకోలేదు. అయితే మంచి నటుడిగా గుర్తింపు అందుకోవాలని ట్రై చేస్తున్న సమయంలో మాత్రం రవి బాబు ద్వారా అతనికి అవకాశం లభించింది. భూమిక ప్రధాన పాత్రలో వచ్చిన అమరావతి సినిమాలో తారకరత్న ఒక సైకో పాత్రలో నటించాడు. అందులో నెగిటివ్ షేడ్స్ తోనే కాకుండా ఎమోషనల్ గా కూడా నటించి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు.

ఆ పాత్రకు నంది అవార్డు
ముఖ్యంగా అమరావతి సినిమాలో క్లైమాక్స్ లో తారకరత్న నటించిన విధానం అప్పట్లో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాకు అతనికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు కూడా లభించింది. అందులో చివరలో భూమికతో చేసిన ఒక సన్నివేశం చూస్తే తారకరత్నలో మంచి నటుడు ఉన్నాడు అనేదానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు

అలాంటి పాత్రలు వచ్చి ఉంటే..
తారకరత్నకు మళ్ళీ అలాంటి అవకాశాలు వస్తే తప్పకుండా నిరూపించుకోగలడు అని అమరావతి సినిమాతో ఒక ఉదాహరణ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో అతనికి ఎలాంటి పాత్రలు రాలేదు. ఒకవేళ అలాంటి పాత్రలు వచ్చి ఉంటే కనుక అతను కూడా తెలుగు ఇండస్ట్రీలో మరో ప్రకాష్ రాజ్ జగపతిబాబు తరహాలో ఉండేవాడు అని ఫ్యాన్ ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఏదేమైనాప్పటికీ తారకరత్న సక్సెస్ ఫుల్ హీరో కాకపోయినప్పటికి బ్యాడ్ పెర్ఫెమర్ కాదు అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











