నందమూరి ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ ఝలక్.. మహేష్ మూవీలో విలన్ వార్తకు అలాంటి క్లైమాక్స్

నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. హరికృష్ణ కంటే బాలకృష్ణ బాగా క్లిక్ అయ్యారు. కానీ హరికృష్ణ కొన్ని సినిమాలు చేసి రెస్ట్ తీసుకున్నారు. అయితే వారి తర్వాత తరంలో నందమూరి తారకరత్న కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒకానొక సందర్భంలో ఒకే రోజు 9 సినిమాలు ఓపెనింగ్ కూడా చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే ఆయన మహేష్ బాబు సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద క్లారిటీ వచ్చింది

హీరోగా

హీరోగా

నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడైన తారకరత్న 2002 వ సంవత్సరం లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన చేసిన యువరత్న అనే సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. తర్వాత తారక్, భద్రాద్రి రాముడు, వెంకటాద్రి వంటి సినిమాల్లో ఆయన హీరోగా కనిపించారు.

9 సినిమాలు

9 సినిమాలు

ఒకానొక సందర్భంలో ఆయన 9 సినిమాలు ఓపెనింగ్ ఒకేరోజు చేశాడు అంటారు కానీ ఆ సినిమాలు ఏవి షూటింగ్ పూర్తయి విడుదలకు నోచుకోలేదు. తర్వాత ఆయన క్యారెక్టర్ నటుడిగా మారి సినిమాలు చేస్తూ వచ్చారు. అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను నంది అవార్డు కూడా లభించింది. ఆ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా ఆయన చేసిన నందీశ్వరుడు, చూడాలని చెప్పాలని, ఎదురులేని అలెగ్జాండర్, విజేత, నయీం డైరీస్ వంటి సినిమాలు విడుదలయ్యాయి.

డాక్టర్ సింబల్స్ వేసి

డాక్టర్ సింబల్స్ వేసి

కానీ ఏవీ మనోడికి పేరు తీసుకు రాలేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఒక వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే నందమూరి తారక రత్న పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి SSMB 28 లోడింగ్ అని చెబుతూ డాక్టర్ సింబల్స్ వేసి ఒక ట్వీట్ చేయడంతో ఈ సినిమాలో తారకరత్న నటిస్తున్నాడని, డాక్టర్ పాత్ర పోషిస్తున్నాడని మహేష్ బాబుకు విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం మొదలైంది.

 పీఆర్ టీమ్ ద్వారానే

పీఆర్ టీమ్ ద్వారానే

త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు ఇలా పాతబడిన హీరోలు ఎవరో ఒకరిని తీసుకువచ్చి వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి జనం కూడా నిజమే అనుకున్నారు. అయితే తాజాగా ఈ విషయం మీద తారకరత్న పీఆర్ టీమ్ స్పందించింది. పిఆర్ టీమ్ ద్వారా తారకరత్న స్పందిస్తూ తనకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్స్ లేవని తనకు సంబంధించిన, తన సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నాసరే అవి పీఆర్ టీమ్ ద్వారానే వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
నందమూరి అభిమానులకు నిరాశే

నందమూరి అభిమానులకు నిరాశే

ఇప్పటివరకు తారకరత్న ఒక్కడే సరిగ్గా నిలదొక్కుకోలేక లేదు, మహేష్ బాబు సినిమాలో విలన్గా నటిస్తే ఆ తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చి ఆయన కూడా నిలదొక్కుకుంటాడు అని భావించిన నందమూరి అభిమానులకు ఇది కాస్త ఇబ్బందికర విషయమనే చెప్పాలి. చూడాలి మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X