Nandamuri Tarkaratana: ఒక్కరోజే రికార్డు స్థాయిలో సినిమాలు.. ప్రపంచంలోనే ఏకైక హీరోగా ఆ ఘనత!
గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని NH ఆసుపత్రిలో పోరాడుతూ చికిత్స అందుకున్న నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఈ వార్త కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేస్తుంది. ఇక అతనికి సంబంధించిన అనేక రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నందమూరి తారకరత్న రికార్డు స్థాయిలో ఒక గిన్నిస్ బుక్ రికార్డును కూడా అందుకున్నాడు. ఒకేరోజు 9 సినిమాలతో లాంచ్ అయిన హీరోగా అతను అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలిచాడు. ఆ వివరాలలోకి వెళితే..

తారకరత్న ఎంట్రీ
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక ఆయన తర్వాత మూడవ తరం వారసులు చాలామంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తర్వాత తారకరాత్న కూడా లాంచింగ్ కూడా బాగానే జరిగింది. దాదాపు జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న ఒకేసారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు.

బాలకృష్ణ సపోర్ట్ ద్వారా..
నందమూరి తారకరత్న అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం. అతనితో బాలయ్య బాబుకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే తన చేతుల మీదుగానే ప్రత్యేకంగా సినిమాలను లాంచ్ చేయించడం కూడా జరిగింది. ఇక అందులో ముఖ్యంగా కెరీర్ మొదట్లోనే ఏకంగా ఒకేసారి 9 సినిమాలకు సంతకం చేసి ఒకరోజు లాంచ్ చేయడం విశేషం.

హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే..
2002లో తారకరత్న హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే నందమూరి ఫ్యాన్స్ లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మూడవ తరం లో నుంచి మరొక వారసుడు రాబోతున్నాడు అనగానే తప్పకుండా అతను కూడా మంచి హీరోగా సక్సెస్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ రేంజ్ లో అయితే తారకరత్న సక్సెస్ కాలేదు. కానీ అతను వ్యక్తిగతంగా మాత్రం అందరితోనూ ఎంతో స్నేహంగా ఉండేవాడు అని చెబుతూ ఉంటారు.

గిన్నిస్ బుక్ రికార్డ్
ఇక తారకరత్న గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే అతను ఎంట్రీ ఇచ్చినప్పుడు 2002లో ఒకేసారి 9 సినిమాలను లాంచ్ చేయడం విశేషం. అప్పట్లో అతనికి సంబంధించిన అనేక రకాల వార్తలను కూడా వచ్చాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కగా కీరవాణి మ్యూజిక్ అందించారు.

ఆ సినిమాలు మాత్రమే రిలీజ్
ఇక ఆ తర్వాత యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు ఇలాంటి సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. అయితే మొదట తొమ్మిది సినిమాలను లాంచ్ చేయగా అందులో కేవలం ఈ సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన సినిమాలు కొన్ని ప్రారంభ దశలోనే ఆగిపోగా మరికొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోయాయి.

విలన్ పాత్రలో అవార్డ్
నందమూరి తారకరత్న హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా మంచి వ్యక్తిగా మాత్రం ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోయాడు. అతను ఎవరితో కూడా ఇప్పుడు తప్పుగా వ్యవహరించినట్లు లేదు. అందరిని సమానంగా చూసేవాడు అని సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇక అంతే కాకుండా తారకరత్న రవి బాబు దర్శకత్వంలో అమరావతి అనే సినిమాలో కూడా విలన్ గా నటించాడు. ఆ సినిమాకు అతనికి నంది అవార్డు కూడా దక్కింది.


Click it and Unblock the Notifications











