విడాకులయిన స్త్రీతో తారకరత్న రహస్య వివాహం!
హైదరాబాద్: నందమూరి హీరో తారకరత్న గురువారం రాత్రి హైదరాబాద్ శివారులోని సంఘీ టెంపుల్ లో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. కొంత మంది స్నేహితులు, సనిహితులు సమక్షం ఈ తంతపు పూర్తయింది.
హైదరాబాద్ లో స్థిరపడిన అనంతపురం జిల్లాకు చెందిన మాజీ రవాణా ఉద్యోగి కుమార్తె అలేఖ్యను తారకరత్న వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య కాస్టూమ్ డిజైనర్ గా పని చేసింది. అప్పటి నుంచే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అలేఖ్యకు ఇది వరకే పెళ్లయి....విడాకులు తీసుకుందని మీడియా టాక్. ఆ కారణంగానే తారక రత్న కుటుంబ సభ్యులు నో చెప్పినట్లు ఫిల్మ్ నగర్ గుసగుస.
29 సంవత్సరాల తారకరత్న 2002లో 'ఒకటో నెంబర్ కుర్రాడు' చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు. కెరీర్ ప్రారంభంలోనే ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి సంచలనం సృష్టించిన తారకరత్నకు ఇప్పటి వరకు కెరీర్లో సరైన హిట్ లేదు. ఇప్పటి వరకు రకరకాల కాన్సెప్టులతో తారకరత్న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు.
ఈ హీరో ప్రస్తుతం దయ అనే మరో కామెడీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. తారకరత్న, అర్చన, కృష్ణుడు ప్రధాన తారాగణంగా వీరు.కె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆర్.ఎ. ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత జాని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో తారకరత్న రాముడి గెటప్‌లో కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











