సినీరంగంలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి తన బాబాయ్ ఒక్కమగాడుగా మీ ముందుకు అందరివాడుగా వస్తున్నాడని ప్రతి ఒక్కరు ఆదరించాలని నందమూరి తారకరత్న అన్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించిన నందమూరి తారకరామారావు మనవడిగా పుట్టడం తన అదృష్టమని ఆయన అన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజ ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతులు వెయ్యేళ్ళపాటు చిరస్థాయిగా వుంటాయన్నారుమంగళవారం గుంటూరుజిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు స్మారక రాష్ట్రస్థాయి ఎడ్లపందాల ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తారకరత్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Story first published: Wednesday, January 7, 2009, 12:15 [IST]