»   » ఫ్యాన్ కోసం...నందమూరి డాట్ కామ్

ఫ్యాన్ కోసం...నందమూరి డాట్ కామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. నందమూరి అభిమానులను ఏకతాటిపైకి తెచ్చేందుకు తాజాగా నందమూరి డాట్ కామ్ ప్రారంభమైంది. సోమవారం హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో జరిగిన తన తాజా సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ ఈ వెబ్ సైట్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ....నందమూరి అభిమానులు చేస్తున్న సేవాకార్యక్రమాలు, ఇతర వివరాలు పొందు పరచడంతో పాటు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలని, అభిమానులను డబ్బు ఎరగా చూపో, లేక ప్రభాలోభపెట్టో సంపాదించుకోలేమని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. జన్మనిచ్చింది తారకరామారావు దంపతులు అయితే, తనను ఇంత వాడిని చేసిందిన అభిమానులే అని, కొందరు ఆశించడానికి పుడతారు, మరికొందరు శాసించడానికి పుడతారు అంటూ వ్యాఖ్యానించారు. నందమూరి డాట్ కామ్‌లో బాలయ్యతో పాటు నందమూరి కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారని తెలుస్తోంది.

English summary
Tollywood actor Nandamuri Balakrishna lanched Nandamuri Web Site Today, Occasion of Balakrishna Birthday. Balakrishna new movie under Boayapti Srinu direction opening held at Ramakrishna Studios
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu