twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నగ్నంగా నటించిందనే..

    By Staff
    |

    Nandana Sen
    ఒకసారి నగ్నంగా నటించావు కదా..మరి మరో సారి నటించటానికి సమస్య ఏముంది అంటూ ఆ నిర్మాతలు నందనా సేన్ ని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్దాయి నగ్నంగా కనపడాలంటూ నందనా సేన్ కి టాప్ ఇటాలియన్ దర్శకుడు Italo Spinelli నుంచి సూపర్ ఆపర్ వచ్చింది. సారి.. అందామె..కానీ వారు వెంటనే మరి 'రంగ్‌ రసియా" చిత్రంలో నగ్నంగా నటించారు కదా అని ప్రశ్నించారు. అందుకామె ఆ చిత్రంలో ఆ సీన్ బాడీ మొత్తం పెయింట్‌తో ఉంటుంది. అది నాచురల్‌ బ్యూటీ. రాజా రవివర్మ మాస్టర్‌ పీస్‌ ను దృష్టిలో ఉంచుకుని అలా నటించానంటూ సమర్ధించుకుంది. కేతన్‌ మెహతా చిత్రం 'రంగ్‌ రసియా"లో నగ్న సన్నివేశాలలో నటించిన నందితాదాస్‌ సేన్‌ వివాదాస్పదమైంది. అయితే అదే అంతర్జాతీయ ఆఫర్స్ తెచ్చిపెడుతోంది.

    ఇంతకీ ఆ ఇటలీ చిత్రంలో ఆమెకు ఆఫర్ చేసిన పాత్ర గిరిజన మహిళ ది. ఈ చిత్రానికి కథ బెంగాలీ సాహిత్యం నుంచి తీసుకుని రూపొందిస్తున్నారు. మహాశ్వేతాదేవి రాసిన షార్ట్ స్టోరీ బిహైండ్ ది బాడీస్ ఆధారంగా ఈ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. నందనాసేన్ ని ఒప్పించేందుకు పలుమార్లు చర్చలు జరిగాయి. మంచి పవర్‌పుల్‌ కథాంశమని ఒప్పించారు. అయితే ఎంత గొప్పకథ అయినా, టాప్‌ ఇటాలియన్‌ డైరెక్టర్‌ అయినా తాను టాప్‌లెస్‌గా నటించడానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పింది నందిత. అయితే త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరగనుండటంతో నగ్నంగా నటించడానికి నందితా ఇష్ట పడటంలేదని సమచారం. మొత్తానికి రంగ్ రసియా రిలీజ్ కాకముందే సంచలనం సృష్టిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నమాట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X