twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ బర్త్ డే కానుకగా ‘నందీశ్వరుడు’...!

    By Sindhu
    |

    నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా 'నందీశ్వరుడు' అనే చిత్రం తెరకెక్కనుంది అన్న విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 10 న అంటే బాలయ్య బాబు పుట్టినరోజు సందర్బంగా ప్రారంభించడానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    నరసింహనాయుడు చిత్రం విజయం తరువాత బాలకృష్ణ తనకు చేసిన సత్కారానికి కృతజ్ఞతగా కధారచయిత చిన్నికృష్ణ ప్రత్యేకంగా ఆయన కోసం తయారుచేసిన కధ ఈ నందీశ్వరుడు. వైవిధ్యభరితమైన ఈ నందీశ్వరుడు చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ ప్రతిస్థాత్మకంగా నిర్మించనున్నాడు. బాలయ్య తో లారీడ్రైవర్, సమరసింహరెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు చేసిన బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది. చిన్నికృష్ణ వినిపించిన కధ బాలయ్యకు నచ్చడంతో సినిమా నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

    ప్రస్తుతం బాలకృష్ణ పరుచూరి మురళి దర్శకత్వంలో కీర్తి కంబైన్స్ బ్యానర్ ఫై యం.యల్.కుమార్ చౌదరి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాపు దర్శకత్వంలో 'శ్రీరామరాజ్యం'లో కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా మనోజ్ హీరోగా రూపొందుతున్న 'ఊ..కొడతారా.. ఉలిక్కి పడతారా' చిత్రంలో ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు.

    English summary
    Nandamuri Balakrishna is going to act as main lead in the movie Nandeeswarudu, buzz is that the movie is going to start from June 10th ie on Balakrishna birthday, the movie is produced by Bellamkonda Suresh but the official news is yet awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X