For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నందీశ్వరుడు' నిర్మాత సిబీఐ అరెస్టు

    By Srikanya
    |

    హైదరాబాద్: తారకరత్న, జగపతి బాబు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'నందీశ్వరుడు'. డెడ్లీ సోమా అనే కన్నడ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని శీను యరజాల (అంజి)దర్శకత్వంలో రూపొందించారు. భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని పొందిన ఈ చిత్రం నిర్మాత ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నారు.

    చండీగఢ్‌ మెడికల్ పీజీ ఎంట్రన్స్‌లో 'హైటెక్ కాపీయింగ్' వ్యవహారంలో టాలీవుడ్ నిర్మాత ప్రమేయం బయటపడింది. 'నందీశ్వరుడు' చిత్ర సహ నిర్మాత కోట గంగాధర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చండీగఢ్‌ కేంద్రంగా వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్షలో హైటెక్‌ కాపీయింగ్‌ వ్యవహారంలో అరెస్టయిన నిందితుల్లో టాలివుడ్‌ నిర్మాత ఉన్నట్లు సీబీఐ విచారణలో తేలింది. సీబీఐ అరెస్టు చేసిన నిందితుల్లో గంగాధర రెడ్డి సినిమా నిర్మాతగా వ్యవహరించినట్లు వెల్లడించింది.

    నందీశ్వరుడు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కోటగంగాధర్‌ రెడ్డి మరో కీలక నిందితుడు గురివిరెడ్డితో కలిసి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించినట్లు విచారణలో సీబీఐ తేల్చింది. ఇప్పటికే గంగాధరను అరెస్టు చేసి చండీగఢ్‌లోని స్థానిక సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. సీబీఐ కస్టడీ అనంతరం కోర్టు ఇద్దరికి రిమాండ్‌ విధించింది. హైటెక్‌ కాపీయింగ్‌ కుంభకోణానికి సంబంధించి గురివిరెడ్డి, గంగాధర రెడ్డిలతో పాటు మరో 14 మందిని సీబీఐ అరెస్టు చేసింది.

    హైదరాబాద్ కేంద్రంగా కోట ఫిల్మ్ కార్పొరేషన్ (కేఎఫ్‌సీ)ను నడుపుతున్న ఇతను ఇప్పటికే ఓ చిత్రాన్ని నిర్మించినట్లు సీబీఐ గుర్తించింది. ఇతనికి కేఎఫ్‌సీ సినిమా పేరుతో మరో బ్యానర్ కూడా ఉన్నట్లు ఫేస్‌బుక్ పేజ్ ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో ఇతర సినిమాల్లో పెట్టుబడులనూ ఆరా తీస్తోంది.

    చండీఘర్‌ మెడికల్‌ పీజీ ప్రవేశపరీక్షలో బయటపడిన హైటెక్‌ కాపీయింగ్‌ కుంభకోణానికి సంబంధించి తెలుగు సినీనిర్మాత కోట గంగాధర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాపీ కుంభకోణంలో ఇతనే సూత్రధారని సీబీఐ గుర్తించింది. గంగాధర్‌రెడ్డి ఇటీవల నందమూరి తారకరత్న హీరోగా నందీశ్వరుడు అనే సినిమాను ప్రారంభించారు. ఇతను ఇంతకుముందు ఎమ్‌సెట్‌లో కూడా కాపీ కుంభకోణాన్ని నడిపాడని, ఈ కుంభకోణాల డబ్బుతోనే కోట ఫిలిమ్‌ కార్పొరేషన్‌ పేరిట చిత్ర నిర్మాణసంస్థను పెట్టి సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడని తెలిసింది.

    ఇతను శ్రీకాళహస్తికి చెందినవాడని, ప్రస్తుతం గాంధీ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ చదువుతున్నాడని సమాచారం. ఎప్పటికైనా శ్రీకాళహస్తిలో ప్రాక్టీస్‌ పెట్టడం తన ఆశయమని సన్నిహితులవద్ద చెబుతుంటాడని తెలిసింది. గురివిరెడ్డ అనే మిత్రుని సహకారంతో గంగాధర్‌ రెడ్డి కాపీయింగ్‌ కుంభకోణాలు నడుపుతాడని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఎలాగైనా మెడికల్‌ సీట్లు సంపాదించాలనుకునేవారిని పట్టుకుని వీరు బేరాలు మాట్లాడుకుంటారని, తర్వాత ఆ విద్యార్ధులకు ప్రశ్నాపత్రాలను స్కాన్‌ చేసే ప్రత్యేక కళ్ళద్దాలు, జవాబులు వినడానికి బ్లూటూత్‌ పరికరాలు ఇచ్చి హైటెక్‌ పద్ధతిలో కాపీయింగ్‌ చేయిస్తారని ఆరోపణ. హైదరాబాద్‌లో ఉండే ఎక్కడికైనా జవాబులు పంపడం వీరి ప్రత్యేకత.

    English summary
    The Central Bureau of Investigation (CBI) had taken Kota Gangadhar Reddy, the producer of Nandamuri Tarakaratna’s Nandeeswarudu for his alleged involvement in Hitech mass copying scam in MD and MS (doctor of medicine and master of surgery) entrance examinations at the Post-Graduate Institute of Medical Education and Research (PGIMER) along with Gurivi Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X