twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరసింహనాయుడు గొడవ మళ్ళీ మొదలా?: బాలయ్య నంది అవార్డుపై గుసగుసలు

    నందీ అవార్దుల జ్యూరీలో ఉన్న బాలయ్య సినిమాకి మూడు నందీ అవార్డులు రావటం పట్ల కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.

    |

    2013కి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌ని ఎంపిక చేయడం టాలీవుడ్ లోనే పెద్ద డిస్కషన్‌ పాయింట్‌ అయింది. 2013కి గాను ప్రభాస్‌, మహేష్‌ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), పవన్‌కళ్యాణ్‌ (అత్తారింటికి దారేది) ఫ్రంట్‌ రన్నర్స్‌ అని తెలియగానే చాలామందే నొసలు ముడేసారు. మిర్చిలో మరీ నంది అవార్డు వచ్చేంత విషయం ఏముందో ఎవ్వరికీ అర్థం కాలేదు.

    Recommended Video

    నంది అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా బాలయ్య
    పక్కా కమర్షియల్ ఫార్ముల్

    పక్కా కమర్షియల్ ఫార్ముల్

    జనరల్ గా కమర్షియల్ చిత్రాలకు అవార్డు ఇవ్వడం తక్కువ. క్రిటిక్స్ మెప్పుపొందిన చిత్రాలు అవార్డులకు ఎక్కువగా ఎంపిక అవుతుంటాయి. ఈ పాయింట్ తీసుకుంటే 'మిర్చి' పక్కా కమర్షియల్ ఫార్ముల సినిమా. గొప్ప కధేం కాదు. ఊరి కోసం హీరో నిలబడటం,హీరోయిజం ఎలివేట్ చేసే బిల్డప్పులు, విలన్ ని బకరా చేసి ఆ ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ మనుషుల్ని మార్చేయడం.. ఇదంతా పరమ రొటీన్ వ్యవహారం.

     కొరటాల శివ

    కొరటాల శివ

    స్వయంగా దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని అంగీకరించాడు. "మిర్చి కొత్త కధ కాదు. తెలిసిన కధనే కొంచెం డిఫరెంట్ గా చూపించాను" అని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. అలా జరిగిన కాంట్రవర్సీ ఆ సంవత్సరానికి సరిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో కాంట్రర్సీ వచ్చింది.

    అవార్దుల జ్యూరీలో ఉన్న బాలయ్య

    అవార్దుల జ్యూరీలో ఉన్న బాలయ్య

    ఇప్పటికే నందీ అవార్దుల జ్యూరీలో ఉన్న బాలయ్య సినిమాకి మూడు నందీ అవార్డులు రావటం పట్ల కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరహా కాంట్రవర్సీ గతంలో కూడా బాలయ్య ఎదుర్కున్నాడు. తెలుగు రాష్ట్రాల విభజనకి ముందు సమైక్యరాష్ట్రంలో ఉండగా వచ్చిన నరసింహ నాయుడు సమయం లోకూడా వచ్చింది.

    బోలెడన్ని వచ్చాయి

    బోలెడన్ని వచ్చాయి

    అప్పట్లోనే వినిపించిన మాట.. బావ అధికారంలో ఉన్నప్పుడు బాలయ్యకు ఆ మాత్రం అవార్డులు దక్కవా ఏమిటి? అనేది వినిపించిన సమాధానం. నరసింహనాయుడు సినిమా కమర్షియల్ గా హిట్టైతే అయ్యుండొచ్చు.. కానీ అందులో బాలయ్య నటనకు నందీ అవార్డు దక్కడం మాత్రం విడ్డూరమైన అంశం అనిపించుకుంది. ఆ మాత్రం యాక్షన్ ఎంటర్ టైనర్లు బోలెడన్ని వచ్చాయి.. ఆ సంవత్సరంలో.

    మిగతా సినిమాల పరిస్థితి ఏమిటి?

    మిగతా సినిమాల పరిస్థితి ఏమిటి?

    మరి బాలయ్యకు అవార్డు ఇస్తే మిగతా సినిమాల పరిస్థితి ఏమిటి? అని క్రిటిక్స్ ప్రశ్నించారు. అయితే అప్పట్లో నందీ అవార్డుల కమిటీ సమాధానం ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మళ్లీ బావ చేతిలో అధికారం, బాలయ్య చేతికి అవార్డు.. అంశంపై తెరపైకి వచ్చింది. ఈ సారి ‘లెజెండ్'కు అవార్డుల పంట పండింది. ఇదంతా.. బావ చేతిలో అధికారం పుణ్యమే అనే మాట గట్టిగా వినిపిస్తోంది.

    ఇలాంటి సినిమాలకే ఇస్తారు

    ఇలాంటి సినిమాలకే ఇస్తారు

    అప్పట్లో నరసింహనాయుడు ఎలాంటి యాక్షన్ ఎంటర్ టైనరో, లెజెండ్ కూడా అలాంటి యాక్షన్ ఎంటర్ టైనరే. ఇవన్నీ ఫక్తు కమర్షియల్ సినిమాలు. మరి నందీ అవార్డులు ఇలాంటి సినిమాలకే ఇస్తారు, నందీ అవార్డుల స్టాండర్డ్ అని అయినా ఒప్పుకోవాలి.. లేదా బావ చేతిలో అధికారం కాబట్టి బాలయ్యకు అవార్డు అయినా చెప్పాలి! ఇందులో ఏది రైటు?

    English summary
    The Same issue Hapend, When Narasimha Nayudu Movie got Nandi award Repeated again
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X