అతి జాగ్రత్తతతో...మహేష్,నాగ్

''అందరికీ నమస్కారం. నా రెండో ఉత్తమ అవార్డు తీసుకుంటున్నాను. ఇప్పటివరకు నాన్నగారి ముందు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఈ రోజు ఆనందంగా ఉంది. 'అతడు' నాకు బాగా నచ్చిన సినిమా. దీనికి అవార్డు రావడం సంతోషంగా ఉంది. మా అమ్మమ్మకు నందులంటే ఇష్టం. గతంలో వచ్చినవాటిని ఆమె పూజగదిలో పెట్టి పూజిస్తోంది'' అని 2005కు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అన్నాడు.
ఇక నాగార్జున అయితే మరింత జాగ్రత్తగా...
''నేను ఇప్పటివరకు 3, 4 నంది అవార్డులు తీసుకుని ఉంటాను. గుర్తులేదు. అయితే ఇంత కన్నులపండవగా కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రికి సినీపరిశ్రమ కృతజ్ఞతలు తెలపాలి. సినిమా టికెట్ల ధరను రూ.35 నుంచి రూ.50కు పెంచడం మీకు ఇష్టం లేకపోవచ్చు. మాకు మాత్రం అవసరం'' అంటూ వ్యాఖ్యానించారు. అలా వీరిద్దరూ తెలివిగా తప్పించుకుని,వైయస్ అసహనానికి కారణమయ్యారు.


Click it and Unblock the Notifications











