twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతి జాగ్రత్తతతో...మహేష్,నాగ్

    By Staff
    |

    Nagarjuna-Mahesh Babu
    నాగార్జున,మహేష్ బాబు ప్రసంగాలతో నంది అవార్డుల పంక్షన్ ని కాంగ్రేస్ సభగా మలుద్దామనుకున్న ఆశలు పై వారిద్దరూ నీళ్ళు జల్లి వెళ్ళారు. దాంతో వైయస్ అసహనానికి గురై సభ మధ్యలోనే లేచి వెళ్ళిపోవటం జరిగింది. వాస్తవానికి ఎన్నడూ లేని విధంగా విపరీతంగా ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించినా ఫలితం లేకుండా పోవటం కాంగ్రేస్ వర్గాల్లో చర్చగా మారింది. అక్కడికి వచ్చిన మీడియా తో సహా అంతా 2005,2006 సంవత్సరానికి ఉత్తమ నటులుగా ఎంపికైన మహేష్ బాబు,నాగార్జున కాంగ్రేస్ పార్టికి,ప్రభుత్వానికి మధ్ధతు ఇచ్చేలా మాట్లాడుతారని వారు ఊహించారు. అయితే విరుద్దంగా మహేష్‌ మాట్లాడుతూ...

    ''అందరికీ నమస్కారం. నా రెండో ఉత్తమ అవార్డు తీసుకుంటున్నాను. ఇప్పటివరకు నాన్నగారి ముందు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఈ రోజు ఆనందంగా ఉంది. 'అతడు' నాకు బాగా నచ్చిన సినిమా. దీనికి అవార్డు రావడం సంతోషంగా ఉంది. మా అమ్మమ్మకు నందులంటే ఇష్టం. గతంలో వచ్చినవాటిని ఆమె పూజగదిలో పెట్టి పూజిస్తోంది'' అని 2005కు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అన్నాడు.

    ఇక నాగార్జున అయితే మరింత జాగ్రత్తగా...
    ''నేను ఇప్పటివరకు 3, 4 నంది అవార్డులు తీసుకుని ఉంటాను. గుర్తులేదు. అయితే ఇంత కన్నులపండవగా కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రికి సినీపరిశ్రమ కృతజ్ఞతలు తెలపాలి. సినిమా టికెట్ల ధరను రూ.35 నుంచి రూ.50కు పెంచడం మీకు ఇష్టం లేకపోవచ్చు. మాకు మాత్రం అవసరం'' అంటూ వ్యాఖ్యానించారు. అలా వీరిద్దరూ తెలివిగా తప్పించుకుని,వైయస్ అసహనానికి కారణమయ్యారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X