నంది అవార్డుల కమిటీపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
2010 సంవత్సరానికి గాను రాష్ట్ర పభుత్వం శుక్రవారం ప్రకటించిన నంది అవార్డులపై 'మెగాస్టార్ కుటుంబ" వీరాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ఎంపిక సరిగా లేదని, ఎంపిక చేసిన కమిటీ అమ్ముడు పోయిందని ఆరోపణలకు దిగుతున్నారు. నీతిగా, న్యాయంగా అవార్డులు ఎంపిక చేసిన ఉంటే.... పలితాలు వేరేలా ఉండేవని అంటున్నారు.
అవార్డుల ఎంపిక సరిగా జరిగి ఉంటే.... వేదం సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన అల్లు అర్జున్ కు కచ్చితంగా ఉత్తమ నటుడి అవార్డు దక్కేదని.... మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ అన్నారు. ఉత్తమ నటుడిగా ఎంపికైన బాలయ్య నటనను తాము తప్పు పట్టడం లేదని, అయితే వేదంలో అర్జున్ నటన అద్భుతంగా ఉన్నా దాని అవార్డుల కమిటీ గుర్తించక పోవడమే తమ ఆగ్రహానికి కారణం అని వాదిస్తున్నారు.
కాగా....2009లోనూ రామ్ చరణ్(మగధీర) కు దక్కాల్సిన ఉత్తమ నటుడు అవార్డు దాసరి(మేస్త్రీ)కి ఇచ్చారంటూ మెగాప్యాన్స్ గోల చేసిన విషయం తెలిసిందే. తాజాగా దాసరి వర్గానికే చెందిన బాలయ్యకు ఉత్తమ నటుడు అవార్డు దక్కడంతో మెగ ఫ్యాన్స్ ఆగ్రహం ఆపుకోలేక పోతున్నారు. మెగాఫ్యాన్స్ ఆందోళనతో మళ్లీ 'మెగా వర్సెస్ నందమూరి" ఫ్యాన్స్ గొడవ తెరపైకి వచ్చినట్లయింది. గత కొన్ని రోజుల వరకు బాలయ్యపై మెగాప్యాన్స్, మెగా కుటుంబంపై బాలయ్య ఫ్యాన్స్ సెటైర్లు విసురుతూ ఇంటర్నెట్ యుద్ధం చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











