నందులు అందుకున్న దాసరి, బాలయ్య, మనోజ్
2009, 2010 సంవత్సరాలకు గాను ప్రకటించిన నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉగాది పర్వదినాన లలిత కళాతోరణంలో ఘనంగా జరింగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డి.కె అరుణ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేశారు. 2009 సంవత్సరానికి గాను దాసరి నారాయణరావు(మేస్త్రి), 2010 సంవత్సరానికి నందమూరి బాలకృష్ణ(సింహా) ఉత్తమ నటుడు క్యాటగిరీలో నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి కేటగిరీలో తీర్థ(సొంతూరు-2009), నిత్యా మీనన్(అలా మొదలైంది-2010), ఉత్తమ గాయకుడిగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం(మహాత్మ-2010), ప్రత్యేక జ్యూరీ అవార్డును శ్రీకాంత్(మహాత్మ2009), మంచు మనోజ్ (బిందాస్-2010), జెనీలియా(కథ-2010), ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలిగా నందినీరెడ్డి(అలామొదలైంది-2010), సుమన్ సాతూరి(ఇంకోసారి-2009), ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ(రాజు మహారాజు-2009), ఉత్తమ మాటల రచయితగా, సహానటుడిగా ఎల్.బి.శ్రీరామ్(సొంతూరు-2009), ఉత్తమ గేయ రచయితగా సుద్దాల అశోక్ తేజ(మేస్త్రి-2009) తదితరులు నంది అవార్డులు అందుకున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ జాతీయ అవార్డను బి. సరోజ(2009), శారద(2010), రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కె. రాఘవ(2009), ఎం.బాలయ్య(2010), బి.ఎన్ రెడ్డి జాతీయ చలనచిత్రం అవార్డు-2010 బి.నర్సింగరావు స్వీకరించారు. ఇతర కేటగిరీల్లో అవార్డు గెలుచుకున్న వారు కూడా సీఎం చేతుల మీదుగా నందులు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











