twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూకుడు-శ్రీరామరాజ్యం పోటీ, తెలంగాణ సినిమాల జోరు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రతి ఏటా ప్రధానం చేసే నంది అవార్డుల రేసులో ఈ సారి దూకుడు, శ్రీరామ రాజ్యం సినిమాలు పోటీ పోటీగా బరిలో నిలిచాయి. మొత్తానికి రెండు చిత్రాలు సమాన సంఖ్యలో నంది అవార్డులు గెలుచుకోవడం గమనార్హం. అదే విధంగా ఈ సారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా తమ జోరును కొనసాగించాయి. జై బోలో తెలంగాణ చిత్రంతో పాటు, పోరు తెలంగాణ చిత్రాలు అవార్డులకు వివిధ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి.

    దూకుడు

    దూకుడు

    మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు' చిత్రానికి ఏకంగా 7 అవార్డులు దక్కాయి.

    శ్రీరామ రాజ్యం

    శ్రీరామ రాజ్యం

    బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం మూవీ అవార్డుల రేసులో దూకుడు చిత్రానికి గట్టి పోటీ ఇచ్చింది.

    జైబోలో తెలంగాణ

    జైబోలో తెలంగాణ

    ఈ సారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో వచ్చిన జైబోలో తెలంగాణ చిత్రం అవార్డుల రేసులో జోరు కొనసాగించింది. ఈచిత్రానికి మూడు కేటగిరీల్లో నంది అవార్డులు దక్కాయి.

    రాజన్న

    రాజన్న

    ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాజన్న చిత్రం అవార్డుల లిస్టులో చేరింది. నాగార్జునకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.

    మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' చిత్రానికి ఏకంగా 7 అవార్డులు దక్కాయి. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజ్, ఉత్తమ హాస్య నటుడిగా ఎంఎస్ నారాయణ, ఉత్తమ ఫైట్ మాస్టర్ గా విజయ్, ఉత్తమ స్క్రీన్ ప్లేయర్ గా శ్రీను వైట్ల, ఉత్తమ ఎడిటర్ గా ఎంఆర్ వర్మ, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరిలో ఈచిత్రం అవార్డులు దక్కించుకుంది.

    బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం మూవీ అవార్డుల రేసులో దూకుడు చిత్రానికి గట్టి పోటీ ఇచ్చింది. శ్రీరామ రాజ్యం చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకోవడంతో పాటు ఈ చిత్రానికి గాను నయనతారకు ఉత్తమ నటి అవార్డు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ మేకప్ మేన్‌గా రాంబాబు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా పిఆర్కే రాజు, ఉత్తమ గేయ రచయితగా జొన్నవిత్తుల అవార్డులు దక్కించుకున్నారు.

    అదే విధంగా ఈ సారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో వచ్చిన జైబోలో తెలంగాణ చిత్రంతో పాటు, తెలంగాణ ప్రాంత కథాంశంతో రూపొందిన రాజన్న చిత్రాలకు అవార్డుల పంట పండింది. జైబోలో తెలంగాణ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఆ చిత్ర దర్శకుడు ఎన్ శంకర్, ఈ చిత్రంలో పొడుస్తున్న ప్రొద్దుమీద సాంగ్ పాడిన గద్దర్‌కి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు దక్కింది.

    ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాజన్న చిత్రం అవార్డుల లిస్టులో చేరింది. నాగార్జునకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. అదే విధంగా ఈ చిత్రంలో నటించిన బేబీ ఆనికి ఉత్తమ బాల నటి అవార్డు దక్కింది.

    English summary
    The Nandi Awards for excellence in cinema for the year 2011 were announced a little while ago in Hyderabad. Mahesh Babu starrer Dookudu, Balakrishna starrer Sri Rama Rajyam, N Shankar’s Jai Bholo Telangana and Nagarjuna starrer Rajanna bagged the most number of awards this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X