twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉగాదికి.... నంది అవార్డుల మహోత్సవం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత....తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సపరేట్ అయ్యాయి. గతంలో ఒకే రాష్ట్రం ఉన్నపుడు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున నంది అవార్డులు ఇచ్చి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే ఆనవాయితీని కొనసాగించాలని నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా సపరేటుగా తెలంగాణ ప్రభుత్వ మార్కు ఉండేలా అవార్డుల ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

    కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోయే నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే ‘ఉగాది' పర్వదినం సందర్భంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్ అఫిషియో కార్యదర్శి, ఎన్వీ రమణ రెడ్డి ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేశారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Nandi Awards to be presented on Ugadi

    ఈ ఉత్తర్వుల ప్రకారం ఎన్టీఆర్ జాతీయ అవార్డును మరియు సినిమా అవార్డులను కూడా ఉగాది రోజున అందజేస్తారు. సినిమా అవార్డులు మాత్రమే కాకుండా, అక్టోబర్ 15వ తేదిన టీవీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి, థియేటర్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ పుట్టిన రోజు జ్ఞాపకంగా మే 28న నంది అవార్డులు అందజేయాలని నిర్ణయించారు.

    ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుండి జనవరి 16వ తేది వరకు సినిమాలకు సంబందించిన ఎంట్రీలను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. 2012 మరియు 2013 సంవత్సరాలకు గాను, ఇంకా నంది అవార్డులను ప్రకటించలేదు. ప్రభుత్వం త్వరలో కమిటీలు ఏర్పాటు చేయనుంది. అనంతపూర్ లో టీవీ నంది అవార్డుల ప్రదానోత్సవ వేడుక, రాజమండ్రిలో థియేటర్ ఆర్ట్స్ నంది అవార్డుల ప్రదానోత్సవ వేడుక నిర్వహిస్తారు. మరి సినిమా నంది అవార్డుల వేడుక హైదరాబాదా? లేక కొత్త రాజధాని విజయవాడలోనా? అనేది ఇంకా ఖరారు కాలేదు

    English summary
    The Andhra Pradesh government has decided to present the coveted Nandi Awards for excellence in films on every Ugadi, which is the Telugu New Year. The Ex Officio Secretary of Ministry of Information and Public Relations, NV Ramana Reddy has issued the orders in this regard. As per the orders, the NTR National Award and other film related awards will also be presented on Ugadi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X