For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లావుండేవాడు, సిక్స్ ప్యాక్ చూసి షాకయ్యా: మహేష్ బాబు (ఫోటోస్)

By Bojja Kumar
|

హైదరాబాద్: నవీన్‌, నిత్య, శ్రావ్య హీరో హీరోయిన్లుగా ఎస్‌.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం'నందిని నర్సింగ్‌ హోం'. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఆ ఆడియో వేడుక చూసి అభిమానులంతా ఇది ఆడియో ఫంక్షన్ లా లేదని, మా అభిమాన హీరో ఫ్యామిలీ ఫంక్షన్ లా ఉందని అంటున్నారు. అన్నట్లు ఈ సినిమా హీరో మరెవరో కాదు...నటుడు సీనియర్ నరేష్ కుమారుడే. విజయనిర్మలకు స్వయాన మనవడు.

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సీనియర్‌ నరేష్‌, సుధీర్‌బాబు, సాయి ధరమ్ తేజ్, రాజ్ కందుకూరి, ఎం.ఎస్‌.రాజు, బి.గోపాల్‌, ఎ.కోదండరామిరెడ్డి ఇలా ప్రముఖులంతా హాజరయ్యారు.

బిగ్ సీడీ

బిగ్‌ సీడీని సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల విడుదల చేశారు. కృష్ణ, మహేష్ బాబు రాకతో ఆడియో వేడుక సందడిగా సాగింది. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కృష్ణ-మహేష్ బాబు ఫ్యామిలీ హీరోలందరినీ ఒకే వేదికపై చూసిన ఆనందమే ఇందుకు కారణం.

కృష్ణకు అందించిన మహేష్

ఆడియో సీడీలను మహేష్‌ విడుదల చేసి కృష్ణకు తొలి సీడీని అందించారు. మహేష్ బాబు ఆడియో సీడీలు అందజేస్తున్న వేళ ఆడిటోరియం సూపర్ స్టార్ నినాదాలదో దద్దరిల్లింది.

అప్పటి రోజులను గుర్తు చేసుకున్న కృష్ణ

''50 సంవత్సరాల క్రితం తేనెమనసులు సినిమాలో ఆదుర్తి సుబ్బారావుగారు నాతో సహా చాలా మంది కొత్తవాళ్ళతో సక్సెస్‌ ఫుల్‌ సినిమా చేశారు. తొలి సినిమాలో ఎలా యాక్ట్‌ చేయాలో కూడా తెలియదు. ఆయన అందరికీ ట్రైనింగ్‌ ఇచ్చి సినిమా చేశారు. నవీన్ వైజాగ్‌ సత్యానంద్‌గారి వద్ద నటనలో ట్రయినింగ్‌ తీసుకుని హీరోగా పరిచయం అవుతున్నాడు. తనకు ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నాను అన్నారు.

లావుండేవాడు, జోక్ అనుకున్నా

''నవీన్‌ చిన్నప్పట్నుంచి బాగా తెలుసు. పోకిరి, అతడు సినిమా టైంలో తనతో పరిచయం బాగా ఏర్పడింది. తను మంచి ఎడిటర్‌, కొన్ని సీన్స్‌ బాగుండాలని తనను కలిశాం కూడా. తన ఎడిటర్‌గా మంచి టాలెంటెడ్‌ పర్సన్‌. నవీన్‌ ఎడిటర్‌గా ఉన్నప్పుడు ఏం కావాలనుకుంటున్నావ్‌ అని అడిగాను. యాక్ట్‌ చేయాలనుకుంటున్నాను అన్నా.. అన్నాడు. తను అప్పుడు లావుగా ఉండేవాడు. దాంతో తను జోక్‌ చేస్తున్నాడా అని అనుకున్నాను. కానీ ఒక సంవత్సరం తర్వాత తనను కలిశాను. సిక్స్ ప్యాక్ చూపించాడు. తన డేడికేషన్‌ చూసి షాకయ్యాను. మనం హార్డ్‌ వర్క్‌ చేస్తే సక్సెస్‌ వస్తుందనే విషయాన్ని నేను బాగా నమ్ముతాను. నవీన్‌కి, ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి' అన్నారు.

బాధ పడుతూ చెబుతున్నానన్న త్రివిక్రమ్

‘నవీన్ తో అతడు సినిమా దగ్గర్నుంచి పరిచయముంది. అతడు సినిమాకు నవీన్‌ ట్రైలర్‌ కట్‌ చేశాడు. ఫిలిం ఫేర్ వారు ఏవీ ఎడిట్ చేసి ఇవ్వమంటే నేను నవీన్ దగ్గరికే వెళ్లాను. చాలా బాగా చేసిచ్చాడు. సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఎడిటర్లలో వన్ ఆఫ్ ద బెస్ట్. హీరోగా అతను మంచి విజయం సాధించాలి. ఎడిటింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చాలా బాధగా చెబుతున్నా. ఈ సినిమా దర్శక నిర్మాతలకు, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నవీన్‌ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

బాధ పడుతూ చెబుతున్నానన్న త్రివిక్రమ్

‘నవీన్ తో అతడు సినిమా దగ్గర్నుంచి పరిచయముంది. అతడు సినిమాకు నవీన్‌ ట్రైలర్‌ కట్‌ చేశాడు. ఫిలిం ఫేర్ వారు ఏవీ ఎడిట్ చేసి ఇవ్వమంటే నేను నవీన్ దగ్గరికే వెళ్లాను. చాలా బాగా చేసిచ్చాడు. సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఎడిటర్లలో వన్ ఆఫ్ ద బెస్ట్. హీరోగా అతను మంచి విజయం సాధించాలి. ఎడిటింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చాలా బాధగా చెబుతున్నా. ఈ సినిమా దర్శక నిర్మాతలకు, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నవీన్‌ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

హీరో అవుతానంటే షాకయ్యాను

''నవీన్‌ ఎడిటర్‌ అయ్యి మంచి టెక్నిషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సడెన్‌గా వచ్చి ఓ రోజు హీరో అవుతానంటే షాకయ్యాను. పెద్దల ప్రోత్సాహం, నాయనమ్మ కల, ప్రేక్షకుల అభిమానంతో ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మంచి కథ కావడంతో ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశాం. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. దిల్‌రాజు సినిమా చూసి సినిమా చాలా బావుంది. చివరి ముప్పై నిమిషాలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పాడు. అచ్చు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు'' అన్నారు అని నరేష్ తెలిపారు.

తన్నులు తినడం నుండి ఇప్పడు సినిమాలు వరకు కలిసే ఉన్నాం

''నేను నవీన్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. చిన్నప్పట్నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. తన్నులు తినడం నుండి ఇప్పడు సినిమాలు వరకు కలిసే ఉన్నాం. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అచ్చును మేం కోకోనట్‌ అని పిలుస్తుంటాం. ఈ సినిమాలో మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను' అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

హీరో మాట్లాడుతూ...

''చిన్నప్పట్నుంచి మహేష్‌ అన్న అంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. ఎంతో బిజీ షెడ్యూల్‌ ఉన్నా, టైం కేటాయించి ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఇన్‌స్పిరేషన్‌ కూడా మహేష్‌ అన్నే' అని నవీన్ విజయ్ కృష్ణ తెలిపారు.

నేనిక్కడ ఉన్నానంటే

మా విజయ్‌కృష్ణమూవీస్‌ ప్రివ్యూ థియేటర్‌లో తాతగారు, నాన్నమ్మగారు, నాన్న సినిమాలు చూసి పెరిగాను. నేను ఇక్కడ ఉండటానికి కారణం కృష్ణగారు, నాన్నమ్మ, మహేష్‌ అన్న, నాన్నగారే కారణం అని నవీన్ వ్యాఖ్యానించారు.

సినిమా గురించి హీరో మాట్లాడుతూ...

సినిమా గురించి హీరో మాట్లాడుతూ....గిరిగారు సినిమాను అద్బుతంగా తీశారు. కథను నేరేట్‌ చేసినప్పుడే కథ బాగా నచ్చింది. నిర్మాతలు రాధాకిషోర్‌గారు, బిక్షమయ్య సంగంగారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమా తీశారు. అచ్చు నా మిత్రుడు. మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. అద్భుతమైన ట్రాక్‌ ఇచ్చాడు. నా సహ నటులు నిత్య, శ్రావ్యలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసినప్పటి నుండి నాకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఆనందమేసింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు.

ఫస్ట్ సిట్టింగ్ లోనే

''నవీన్‌గారు కథ విని ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. తను ఏం చెబితే అది చేసేవారు. క్లైమాక్స్‌లో ఓసీన్‌లో తన నటన చసి మహేష్‌బాబుగారు గుర్తుకు వచ్చారు. మహేష్‌బాబు, మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు మంచి సినిమా అవుతుంది'' అని దర్శకుడు పి.వి. గిరి అన్నారు.

నాబిడ్డలాంటోడు

''నరేష్‌ నాకు మంచి మిత్రుడు. నవీన్‌ నా బిడ్డలాంటివాడు. దర్శక నిర్మాతలకు, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అని రాజ్‌ కందుకూరి అన్నారు.

కృష్ణ గారి వల్లే

''నా పిలుపే ప్రభంజనం సినిమాతో కృష్ణగారే మాకు ఇండస్ట్రీలో రావడానికి కారణమయ్యారు. అలాగే విజయ్‌నిర్మలగారి దర్శకత్వంలో కూడా నేను మ్యూజిక్‌ చేశాను. నరేష్‌ తనయుడు విజయ్‌కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. అచ్చు మంచి సంగీతాన్ని అందించాడు'' అని కోటి ప్రశంసించారు.

నటీనటులు

షకలక శంకర్‌, సప్తగిరి, వెన్నెలకిషోర్‌, జయప్రకాష్‌ రెడ్డి, జయప్రకాష్‌, సంజయ్‌ స్వరూప్‌ తదితరులు ఇతర తారాగణంగా నటించారు.

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి పాటలు: రెహమాన్‌, మాటలు: పి.వి.గిరి, సురేష్‌ ఆరపాటి, కొరియోగ్రఫీ: విజయ్‌, సంగీతం: అచ్చు, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఆర్ట్‌: ఎస్‌.హరిబాబు, నిర్మాతలు: రాధాకిషోర్‌.జి,బిక్షమయ్య సంగం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.

English summary
Nandini Nursing Home Movie Audio Launch event held at Hyderabad. Mahesh Babu, Krishna, Vijaya Nirmala, Vijaya Naresh, Nawin Vijay Krishna, Nitya Naresh, Shravya, PV Giri. Ranjith, Radha Kishore G., Bikshamaiah Sangam, Saluri Koteswara Rao (Koti), Sudheer Babu, Sai Dharam Tej, Anchor Shyamala graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more