క్యాస్టింగ్ కౌచ్, కౌశల్‌పై నందిని కామెంట్.. వారి వల్లే బిగ్‌బాస్ నుంచి అవుట్!
నందిని రాయ్ హైదరాబాదీ అయినప్పటికీ.. బాలీవుడ్ చిత్రం ఫ్యామిలీ ప్యాక్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత హార్మోన్స్ అనే తెలుగు చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించింది. ఆమె ఏమన్నారంటే..

బిగ్‌బాస్‌తో మరింత క్రేజ్
బిగ్‌బాస్‌తో నాకు మంచి క్రేజ్ పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. బిగ్‌బాస్‌కు ముందు హీరోయిన్‌గా కొందరికే తెలుసు. ఇప్పుడు చాలా మందికి తెలిశాను. ఇప్పుడు బిగ్‌బాస్ నందిని అని పిలుస్తున్నారు. అదంతా బిగ్‌బాస్ వల్లే సాధ్యమైంది.

కౌశల్ లేదా గీతా మాధురీ గానీ
ఇప్పటివరకు జరిగిన బిగ్‌బాస్2 ప్రకారం చూస్తే.. ఈ సారి టైటిల్ విజేత కౌశల్ గానీ, గీతా మాధురిగానీ కావొచ్చు. ప్రస్తుతం ఇంటిలో వారిద్దరు నాకు ఇష్టమైన సెలబ్రిటీలు. కౌశల్, గీతా మధ్య గట్టిపోటి ఉండబోతున్నది. వారిలో ఎవరికి టైటిల్ వచ్చినా నాకు సంతోషమే. సిల్లీ ఫెలోస్ బిజీ కారణంగా రెండు వారాలు నుంచి సరిగా చూడలేదు.

కౌశల్ యాటిట్యూబ్ వల్లే ఫ్యాన్స్
బిగ్‌బాస్‌లో యాటిట్యూడ్ వల్లే కౌశల్‌కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు బిగ్‌బాస్ ఇంటిలో కౌశల్‌ను టార్గెట్ చేయడం వల్ల బయటకు రాలేదు. కౌశల్ ఆర్మీకి నేను నచ్చకపోవడం వల్ల నన్ను వాళ్లు బయటకు వచ్చేలా చేశారు. కౌశల్ ఆర్మీని చూస్తుంటే నేను కూడా అలాంటిది చేసుకొని ఉంటే బాగుండు అని అనిపిస్తున్నది అని అన్నారు.

సౌందర్య స్ఫూర్తిగా నటినయ్యా
దివంగత నటి సౌందర్య స్ఫూర్తిగా యాక్టర్ కావాలనే కోరిక కలిగింది. నా బాల్యంలో సౌందర్యకు కూతురిగా ఓ వ్యాపార ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు ఫ్యాన్స్ ఆమె వెంట పడి ఆటోగ్రాఫ్‌లే తీసుకోవడం, ఆమె ఫాలోయింగ్‌ను చూసి సినీ పరిశ్రమలో స్థిరపడాలని అనుకొన్నాను.

క్యాస్టింగ్ కౌచ్ గురించి
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (వేషాల కోసం పడకగది) గురించి నందిని స్పందించింది. అమ్మాయిల ప్రవర్తన బట్టే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకవేళ అలాంటి బలహీనత కన్పిస్తే అందరూ దాని కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వాటికి దూరంగా ఉంటామని ఎదుటివారికి తెలిస్తే మనల్ని ఎవరు ఏమీ అనరు. నాకు ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదు అని నందిని అన్నారు.

సిల్లీ ఫెలోస్ చిత్రంలో
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నందిని నటించిన సిల్లీ ఫెలోస్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నందిని నటన ఆమెకు గుర్తింపు తెచ్చేలా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజైంది.


Click it and Unblock the Notifications











