వ్యభిచారిణి పాత్రలో బిగ్ బాస్ బ్యూటీ.. ఆ హీరోయిన్ నుంచి ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు!!
నందినీ రాయ్ అంటే తెలుగు ప్రేక్షకులను అంత టక్కున గుర్తుకు రాకపోవచ్చు. సుధీర్ బాబు చిత్రం మోసగాళ్లకు మోసగాడుతో ఎంట్రీ ఇచ్చినా గానీ అంతగా ఫేమస్ కాలేకపోయింది. ఆపై చిన్నా చితకా సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం రాలేదు. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాతే తెలుగు జనాలకు అంతో ఇంతో తెలిసింది. ఇప్పటికీ బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్ అనే ట్యాగ్‌తోనే ఎక్కువ మంది గుర్తిస్తారు. తాజాగా నందినీ రాయ్ ఓ విషయంలో అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అంతగా వర్కౌట్ కావడం లేదు..
బిగ్ బాస్ బ్యూటీ పక్క ఇండస్ట్రీలోనూ పలు చిత్రాలను చేసింది. కానీ అవేవీ గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఇక ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీపై, క్యాస్టింగ్ కౌచ్‌పై నందినీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. కొన్ని చిత్రాలను ఎలా వదులుకుందో, వాటి వల్ల కలిగిన నష్టం ఏంటో కూడా చెబుతూ సంచలన కామెంట్స్ చేసింది.

నందినీ వర్సెస్ శ్రీ రెడ్డి.
ఇక క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నందినీ చేసిన కామెంట్స్ వైరల్ కావడం వాటిపై శ్రీ రెడ్డి కౌంటర్ వేయడం ఎంతగా వివాదాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో అలాంటివి ఉండవని, ఏదైనా సరే మన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుందని, తనకైతే క్యాస్టింగ్ కౌచ్ ఎదురవ్వలేదని చెప్పిన విషయాలు తెగ వైరల్ అయ్యాయి.

మళ్లీ ఇన్నాళ్లకు..
అయితే నందినీ రాయ్ మళ్లీ ఇన్ని రోజులకు వార్తల్లో నిలిచింది. అది కూడా ఓ చిత్రంలో ఎవ్వరూ ఊహించనంత బోల్డ్‌గా నటించింది. ఆహా ఓటిటీ యాప్ కోసం రెడీ అయిన మెట్రోకథలు చిత్రంలో నందినీ బోల్డ్‌గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Recommended Video

వేశ్యగా నటించి..
తాజాగా విడుదల చేసిన మెట్రో కథలు టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒక్క మాట కూడా లేకుండా.. హావాభావాలతో నడిపించేశారు. ఇది నలుగురి జీవితాల చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. అందులో రాజీవ్ కనకాల, సన, తిరువూర్, నందినీ రాయ్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నందినీ రాయ్ మాత్రం వేశ్యగా నటించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రెచ్చిపోయి మరీ శృంగార సన్నివేశాల్లో నటించినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











