twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్ ఆర్మీ వల్లే... తనీష్‌తో ఎఫైర్ లేదు, దీప్తి దొంగ ఏడుపు: నందినీ రాయ్ సంచలనం

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Nandini Rai Clarifies About Her & Tanish Love Rumor

    బిగ్‌బాస్ ఇంటి నుండి గతవారం ఎలిమినేట్ అయిన నందినీ రాయ్ బయటకు వచ్చిన తర్వాత మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా ఆమె కొందరు ఇంటి సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో షాకయ్యాను. ఇంకొంత కాలం ఇంట్లో ఉండాల్సింది.... నా ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అనిపించింది. కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేయడం వల్లే ఇదంతా జరిగింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    ఒకే విషయానికి స్టాండ్ అయ్యాను

    ఒకే విషయానికి స్టాండ్ అయ్యాను

    నాని ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 2 వీక్స్ నా జర్నీ అనేది చాలా బావుంది. బయటకు వచ్చి నన్ను నేనుచూసుకున్న తర్వాత కొన్ని మిస్టేక్స్ అనిపించాయి. అది మిస్టేక్స్ కూడా కాదు. నేను చేసింది రైటే. అది కౌశల్ విషయంలో అయినా, తనీష్ విషయంలో అయినా, దీప్తి విషయంలో అయినా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. నాకు నచ్చలేదంటే నచ్చలేదనే చెప్పాను. అది ఆడియన్స్ ఎలా తీసుకున్నారో తెలియదు.

    కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేసింది

    కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేసింది

    బయటకు వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ ఉన్నట్లు తెలిసింది. నాకు కౌశల్‌కు ఇంట్లో చాలా సార్లు గొడవ జరిగింది. మేము ఫ్రెండ్స్... గొడవ అవుతుంది, బ్రతిమిలాడుకుంటాం, కలిసి తింటాం.... మేము లోపల బానే ఉన్నాం, బయట కౌశల్ ఆర్మీ వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయిందని నమ్ముతున్నాను. వాళ్లు నన్ను టార్గెట్ చేసినందుకు నేను ఎలిమినేట్ అయ్యాను.

    దీప్తి నల్లమోతు దొంగ ఏడుపు

    దీప్తి నల్లమోతు దొంగ ఏడుపు

    లోపల జరుగుతుంది ఒకటి బయటకు ప్రొజెక్ట్ అయింది మరొకటి. ప్లిప్ టాస్క్‌లో దీప్తి కీంద పడిపోయారు. వెంటనే ఏడవకుండా నన్ను చూసిన తర్వాత ఏడ్చింది. ఎలిమినేషన్లో ఉన్న ఆమె నన్ను బ్లేమ్ చేయడానికే ఓవర్ రియాక్ట్ అయింది అనిపించింది.

    కౌశల్ నా బెస్ట్ ఫ్రెండ్

    కౌశల్ నా బెస్ట్ ఫ్రెండ్

    నాకు డిస్ అడ్వాంటేజ్ ఏమిటంటే... నేను రెండో వారం ఎంటరయ్యాను. నన్ను కౌశల్ మాత్రమే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంట్లో ఫస్ట్ ఫ్రెండ్ ఆయనే. చాలా మంచి అడ్వైజెస్ ఇచ్చాడు. కౌశల్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. కౌశల్ వల్ల నాకు మరో ఆపర్చునిటీ కలిగింది అది చాలా పెద్ద విషయం. ఎలిమినేషన్‌కు కౌశల్ కారణం కాదు... కౌశల్ ఆర్మీ కారణ.

    గీత, ఆ ముగ్గురూ ది బెస్ట్

    గీత, ఆ ముగ్గురూ ది బెస్ట్

    బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారిలో గీతా మాధురి, బాబు గోగినేని, తనీష్ వీళ్లంతా చాలా పాజిటివ్ సోల్స్. ఏదైనా సిచ్యువేషన్‍‌ ఎదురైతే... అది తప్పయితే దానికే స్టాండ్ అవుతారు. ఒప్పు అయితే ఒప్పు అని చెబుతారు.

     తనీష్‌తో ఎఫైర్ లేదు

    తనీష్‌తో ఎఫైర్ లేదు

    తనీష్‌ను హగ్ చేసుకోవడంపై చాలా ట్రోల్స్ జరిగాయని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. ఇంట్లోకి వెళ్లి దాదాపు 50 రోజులు దాటింది. అప్పుడే నేను, తనీష్ ఓపెన్ అవుతున్నాం. ఇంట్లో ఎవరు ఏమిటి? ఇక నుండి ఎలా ఉండబోతోంది అనే విషయంలో మా ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. తన పర్సనల్ లైఫ్ గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి కొంత షేర్ చేసుకున్నాం. మేము మంచి ఫ్రెండ్స్... అంతే కానీ మా మధ్య ఎఫైర్ లేదు.

    ఆ సమయంలో హగ్ తప్పే.. కానీ తప్పుడు ఉద్దేశ్యం లేదు

    ఆ సమయంలో హగ్ తప్పే.. కానీ తప్పుడు ఉద్దేశ్యం లేదు

    రాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత హగ్ చేసుకోవడం తప్పే. కానీ మాలో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు. ఆ సమయంలో నేనూ ఏడ్చాను, ఆ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అపుడు చాలా ఎమోషనల్ అయ్యాం. తనీష్‌ను ఓదార్చడానికి హగ్ ఇవ్వడం జరిగింది. దానికి లవ్ ఎఫైర్ అని పేరు పెట్టేయడం బాధ అనిపించింది.

    English summary
    Nandini Rai Clarifies About Her & Tanish Love Rumor. She said we are just friends not lovers. Actress Nandini Rai has been eliminated from Nani's TV show Bigg Boss Telugu 2 in the eighth week, while Kaushal, Babu Gogineni, Ganesh and anchor Deepthi remained safe from eviction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X