'అలా మొదలైంది' దర్శకురాలు నెక్ట్స్ ఆ రొమాంటిక్ హీరోతో
ఈ మధ్య కాలంలో విజయవంతమైన చిన్న చిత్రం అలా మొదలైందితో పరిచయమైన మహిళా దర్శకురాలు నందినీరెడ్డి. ఈ చిత్రం విజయవంతం కావటంతో ఆమెకు వరస ఆఫర్స్ వచ్చాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నుంచి వచ్చిన క్రేజీ ఆఫర్ ను ఒప్పుకున్న ఆమె తన తదుపరి చిత్రాన్ని మార్చి నెలాఖరులో ప్రారంభించటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్రంలో సిద్దార్ధ హీరోగా,సమంతను హీరోయిన్ గా ఎంపికచేసుకుంది. సమంత ని డేట్స్ అడిగిన వెంటనే అలా మొదలైంది చిత్రం స్పెషల్ షో ని పిబ్రవరి 26 న చూసి ఓకే చేసింది. ఇక సిద్దార్ద వెంటనే డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దాంతో నందినీరెడ్డి తన స్క్రిప్టుకి ఫైనల్ ఛేంజెస్ చేసుకుంటోంది. ఈ చిత్రంకూడా ఓ రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సిద్దార్ధ ..దిల్ రాజు చిత్రం ఓహ్ మై ప్రెండ్ ని ఒప్పుకున్నారు. వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కానున్నాడు. స్నేహం, ప్రేమ అంశాలు చుట్టూ తిరిగే ఆ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











