For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’.... అలా మొదలైంది డైరెక్టర్ ఇలా టర్న్ అయ్యారు

    By Bojja Kumar
    |
    ముగ్గురి లవ్ స్టోరీ.. అద్దిరింది

    'అలా మొదలైంది' లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు నందినీ రెడ్డి ఇపుడు వెబ్ సిరీస్‌ వైపు టర్న్ అయ్యారు. 'మన ముగ్గురి లవ్ స్టొరీ' పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ ఫస్ట్ ఎపిసోడ్ తాజాగా రిలీజైంది. ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది.

    లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఐస్ క్రీం, లవర్స్ లాంటి చిత్రాలతో అలరించిన తేజస్వి ఈ సిరీస్‍‌లో అమాయకమైన పాత్రలో లీడ్ రోల్ చేసింది.

    Nandini Reddy's

    తేజస్వికి జోడిగా నవదీప్ ముఖ్య పాత్రలో నటించాడు. తేజస్వి తల్లి కారెక్టర్ లో సీనియర్ యాక్టర్ ఐశ్వర్య, ఆర్ జే హేమంత్, ధనరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. గెస్ట్ పాత్రలో హీరో విజయ్ దేవరకొండ కనిపించడం విశేషం.

    దీని కాన్సెప్టు విషయానికొస్తే.... ఎదిగిన కూతురుకి పెళ్లి చేయాలనే ఆలోచనలో తల్లి..పెళ్లి నుంచి తప్పించుకోవాలని కూతురు..ఈ నేపధ్యం లో హైదరాబాద్ వెళ్లి తేజస్విని పడే పాట్లు చూస్తే నవ్వుపుట్టిస్తాయి. టైటిల్ లో ముగ్గురు లవ్ స్టొరీస్ అని మెన్షన్ చేశారు కాబట్టి మరి మున్ముందు ఈ సిరీస్ ఎలా వుంటుందో చూడాలి.

    English summary
    Mana Mugguri Love Story.. it is a web seies which is directed by nandini reddy. Navadeep, vijay devarakonda, dhanaraj played main roles in this web series. The series first episode released today and it is getting huge responce in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X