సిద్ధార్థతో హిట్ కొడతా : బెల్లంకొండ
సిద్ధార్థ, సమంత జంటగా 'అలామొదలైంది" దర్శకురాలు బి.వి నందిరెడ్డి దర్శకత్వంలో సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...'సిద్దార్ధ, సమంత హీరో హీరోయిన్లుగా నందినిరెడ్డి అద్భుతమైన కథ చెప్పడం జరిగింది. సిద్ధార్ధ, సమంత కూడా కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయ్యారు. ఈ సినిమాను భారీగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మా బ్యానర్ లో ఇది మరో మంచి హిట్ సినిమా అవుతుందని ఆశిస్తున్నా. జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది" అన్నారు.
2011లో కాంచన, కందిరీగలాంటి సూపర్ హిట్ చిత్రాలను, నిర్మించిన బెల్లంకొండ సురేష్ బేనర్ లో 'అలామొదలైంది" లాంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయ్యెచ్చని సినీవర్గాలంటున్నాయి.
ఈ చిత్రానికి సంగీతం : థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి .మహేంద్రబాబు, నిర్మాత : బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.నందినిరెడ్డి.


Click it and Unblock the Notifications











