ఫిలిం ఫెస్టివల్స్‌కు కమ్లి
అవార్డు చిత్రాల రూపకర్త కె. ఎన్. టి. శాస్త్రి దర్శకత్వంలో నందితా దాస్ మొదటిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం - కమ్లి అప్పుడే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం రెండు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శనకు ఎంపిక కావడం విశేషం. దక్షిణ కొరియా పూసాన్‌లో 11వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, ముంబయిలో జరిగే 3వ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ఈ చిత్రం ప్రదర్శనకు నోచుకుంటోంది. నందితా దాస్ సరసన షఫీ, ఇంకా తనికెళ్ల భరణి, రూపాదేవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
కమ్లి ఒక లంబాడీ వీరవనిత గాథ. కరువు కాటకాల మధ్య, సమాజంలో అనేక విధాలుగా వంచించబడుతున్న లంబాడీలు ఉపాధి లేక, చివరికి సొంత బిడ్డల్ని తెగనమ్ముకునే దయనీయ స్థితిగతులు ఈ చిత్రంలో ఎంతో హృద్యంగా చూపించారు దర్శకుడు కె.ఎన్.టి. శాస్త్రి. గతంలో ఆయన రూపొందించిన తిలదానం చిత్రం దేశ, విదేశాలలో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications