For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వదిలేస్తే చేయొద్దా? దుమ్ముదులిపిన నందితా దాస్ .. ఆ డైరెక్టర్‌ విజన్ చాలా గొప్పగా..

|

నీదీ నాది ఒకే కథ తర్వాత అభ్యుదయ భావాలు కల దర్శకుడు వేణు ఊడుగుల రూపొందిస్తున్న చిత్రం విరాటపర్వం. సాయిపల్లవి, రానా దగ్గుబాటి లాంటి హిట్ కాంబినేషన్‌తో సుమారు రూ.100 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించే పనిలో వేణు ఊడుగుల తలమునకలై ఉన్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటి నందితా దాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తన పాత్ర విషయంలో తలెత్తిన ఊహాగానాలపై నందితా ఘాటుగా స్పందించారు. ఆమె స్పందించిన విషయం వెనుక అసలు విషయం ఏమిటంటే..

టబు తప్పుకోవడంతో నందితా దాస్

టబు తప్పుకోవడంతో నందితా దాస్

విరాటపర్వం మూవీలో కీలక పాత్ర కోసం టబును సంప్రదించారు. దాదాపు ఆ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిన టబు కొన్ని కారణాల వల్ల తప్పుకొన్నది. టబు పాత్ర కోసం వెంటనే నందితా దాస్‌ను సంప్రదించడం, ఆమె కథ నచ్చడంతో ఓకే చేయడం జరిగిపోయింది. అయితే టబు వదిలేసిన పాత్రను నందితా దాస్ చేయడమేమింటనే విషయంపై సోషల్ మీడియాలో కొన్ని అనుమానాలను లేవనెత్తారు.

 సోషల్ మీడియా ప్రచారంపై ఘాటుగా

సోషల్ మీడియా ప్రచారంపై ఘాటుగా

సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ రకమైన ప్రచారానికి నందితా దాస్ తెరదించే ప్రయత్నం చేశారు. విరాటపర్వంలో నా పాత్ర గురించి ఎక్కువగానే ఊహాగానాలు వినపడుతున్నాయి. స్క్రిప్టు నచ్చడం వల్లే ఈ సినిమాను చేస్తున్నాను. డైరెక్టర్ విజన్, నా రోల్ నన్ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఒకరు వదిలేసుకొన్న పాత్రను నేను చేస్తున్నాననే విషయంలో నాకు పట్టింపు లేదు. సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాను. నాకు విషెస్ అందజేయండి అంటూ నందితా దాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దశాబ్దం కాలం తర్వాత తెలుగులో

దశాబ్దం కాలం తర్వాత తెలుగులో

దశాబ్దం తర్వాత తెలుగు భాషలో నటిస్తున్నాను. నాకు భాషపై అంతగా పట్టులేకపోవడంతో కొంత ఇబ్బంది గురైంది. కానీ ఒకసారి సెట్లో అడుగుపెట్టిన తర్వాత అవేమీ పట్టించుకోకుండా షూట్‌ను ఎంజాయ్ చేసే పనిలో పడ్డాను. బలమైన కథ, బాధ్యతాయుతమైన డైరెక్టర్ ఉంటే అన్ని సానుకూలంగా కనిపిస్తాయి అని నందితా దాస్ అన్నారు.

డైరెక్టర్ విజన్ గొప్పగా

డైరెక్టర్ విజన్ గొప్పగా

డైరెక్టర్ వేణు ఊడుగుల, చిత్ర యూనిట్ చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం నన్ను మరింత ఆకట్టుకొన్నది. సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉండే పరిస్థితులు చాలా రోజుల తర్వాత తారసపడ్డాయి. సాయిపల్లవితో కలిసి నటించడం చాలా ఆనందం కలిగిస్తున్నది. సాయిపల్లవి అద్భుతమైన నటియే కాకుండా వ్యక్తిగతంగా మంచి మనిషి అని నందితా దాస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండో షెడ్యూల్‌లో రానా దగ్గుబాటితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

నక్సలైట్ ఉద్యమం కథా నేపథ్యంతో

నక్సలైట్ ఉద్యమం కథా నేపథ్యంతో

విరాటపర్వం చిత్రం 1990లో నక్సలైట్ ఉద్యమం నాటి పరిస్థితులు, సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందింది. రానా నక్సలైట్ నాయకుడిగా కనిపిస్తున్నట్టు సమాచారం. సాయిపల్లవి కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య జరిగే ఘర్షణ, భావోద్వేగ సన్నివేశాలతో కథా, కథనాలు ఉంటాయని తెలిసింది.

English summary
Versatile Actress Nanidta Das returned to Tollywood after 13 years. She has won National Award for Kamli in 2006 for best performer. Now She is doing Virataparvam of director Venu Udugula, Which starring Sai Pallavi and Rana Daggubati.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more