‘ప్రేమ కథా చిత్రమ్ 2’లో నందితా శ్వేతా
ప్రేమ కథా చిత్రమ్, జక్కన్న సినిమాల తర్వాత ఆర్‌పిఏ క్రియేషన్స్ ప్రేమ కథా చిత్రమ్‌కు సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌పిఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా "ప్రేమ కథా చిత్రమ్ 2" తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. అగస్ట్ మొదటి వారంలో భారీగా రెండవ షెడ్యూల్‌ని జరుపుకుంటుంది. ఈ చిత్రానికి 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్.
సుమంత్ అశ్విన్ హీరో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా హరి కిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' ఫేం నందితా శ్వేత హీరోయిన్ ఎంపికైంది. 'జంబలకిడి పంబ' ఫేం సిధ్ధి ఇదాని మరో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రమ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అలాగే జక్కన్న సూపర్ హిట్స్‌గా మా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రమ్ హిలేరియస్ కామెడీతో ట్రెండ్ క్రియేట్ చేస్తే, జక్కన్న కమర్షియల్ సక్సస్‌ని తెచ్చింది. మా బ్యానర్‌లో మూడవ చిత్రంగా ఇప్పుడు 'ప్రేమ కథా చిత్రం 2' నిర్మిస్తున్నాం. సుమంత్ ఆశ్విన్ హీరోగా నటిస్తున్నారు. హరి కిషన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది' అన్నారు.
నటినటులు.. సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిధ్ధి ఇదాని తదితరులు
సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ - సి. రాం ప్రసాద్,
ఎడిటర్ - ఉద్ధవ్,
సంగీతం - జెబి
డైలాగ్ రైటర్ - చంద్ర శేఖర్
ఆర్ట్ - అశోక్
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను
కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు - హరి కిషన్


Click it and Unblock the Notifications











