శ్రీనివాస కళ్యాణం: తన పాత్ర గురించి చెప్పేసిన నందితా శ్వేతా
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేం నందితా శ్వేతా కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
ఆగస్టు 9న శ్రీనివాస కళ్యాణం మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిత తన పాత్ర గురించి వివరించారు. చిత్రంలో పద్మావతి అనే గ్రామీణ అమ్మాయి పాత్రలో నటించాను. దిల్ రాజు నేతృత్వంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం తెలుగులో 'ప్రేమకథాచిత్రం 2' అనే మూవీ చేస్తున్నాను. 'సదురంగవేట్టై' తెలుగు రీమేక్‌లో కూడా నటించనున్నాను. తమిళంలో వైభవ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీతో పాటు కన్నడలో ఓ స్టార్ హీరో సినిమాకు కమిట్ అయ్యాను. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను అని తెలిపారు.
"ప్రేమ కథా చిత్రమ్ 2" లో సుమంత్ అశ్విన్ హీరో. హరి కిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నందితా శ్వేతతో పాటు 'జంబలకిడి పంబ' ఫేం సిధ్ధి ఇదాని మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్‌పిఏ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











