For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సైజ్‌ జీరో' కు డబ్బింగ్ పూర్తి చేసిన నందు

    By Srikanya
    |

    హైదరాబాద్ : అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సైజ్‌ జీరో' . ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్‌లో 'సైజ్‌ జీరో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డబ్బింగ్ ప్రారంభించారు. ఆటోనగర్ సూర్య, 100% లవ్ చిత్రాలతో పాపులర్ అయిన నందు ఈ చిత్రంలో హీరో క్యారక్టర్ ఆర్యకు డబ్బింగ్ చెప్పారు.

    nandu-size zero

    నందు మాట్లాడుతూ...."నేను ఆర్య పాత్రకు డబ్బింగ్ చెప్పాను.చాలా ఫన్ గా ఉంది. నేను ఆర్యను ఫాలో అవుతూంటాను. ఇలా డబ్బింగ్ చెప్పటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ," అన్నారు.

    చిత్రం విశేషాలకు వస్తే...

    ‘బాహుబలి' చిత్రంలో దేవసేన పాత్రలో అలరించిన హీరోయిన్ అనుష్క త్వరలోనే వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ మేరకు రోజుకో పోస్టర్ చొప్పున విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడండి.

    అలాగే కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రం క్షత్రియ పుత్రుడులోని సన్నజాజి పడక పాటను అనుష్క,ఆర్యలపై రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట స్ఫూఫ్ మాత్రం కాదు..సినిమాలో ఓ సన్నివేశంలో ఆర్య,అనుష్క టీవిలో సన్నజాజి పడక సాంగ్ ని చూస్తూంటారు. తమని తాము ఆ పాటలో ఊహించుకుంటారు. సంప్రదాయ దుస్తుల్లో అప్పుడు వీరిద్దరూ ఉంటారు. ఇలా చేయటానికి ఇళయరాజా సైతం సమ్మతించినట్లు చెప్తున్నారు.

    డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో మళ్లీ బరువు తగ్గి నార్మల్ అయింది.

    ఇక హీరో ఆర్య ఇటీవల స్వీడన్ మీదుగా కఠినతరమైన సైకిల్ రైడ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సైజ్ జీరో నిర్మాతలు ఈ చిత్రంలో అలాంటి కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.

    English summary
    "I've dubbed for Arya in Size Zero. It was so much fun. I closely follow Arya's work and it was an honour to dub for him," said Nandoo. Directed by Prakash Kovelamudi, Anushka Shetty plays an obese woman and Arya as her husband and fitness trainer in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X