»   » నందు నూతన చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'

నందు నూతన చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టాలెంటెడ్ హీరో నందు నూతన చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మాతగ నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 15 నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ చిత్రంలో నందు సరసన కన్నడ భామ తేజస్వినీ ప్రకాష్ హీరోయిన్ గా ఎంపికైంది.

హార్ట్ టచ్చింగ్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాకు 'కన్నుల్లో నీ రూపమే' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫొటో, 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు ఈ సినిమాలో ఓ విభన్నమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అలానే ఈ సినిమాతో తేజస్వినీ తెలుగు చిత్ర సీమకి పరిచయం అవుతోంది.

Nandu says Kannullo Nee Roopame

ఇప్పటికే ఈ బ్యూటీ కన్నడలో పలు చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న బిక్స్ ఇరుసడ్ల చిత్ర కథచాలా అద్భుతంగా మలిచాడని, అలానే సంగీత దర్శకుడు సాఖేత్ కంపోజ్ చేస్తోన్న పాటలు కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయని నిర్మాత భాస్కర్ భాసాని తెలిపారు. జూన్ 15 నుంచి షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు.

English summary
Young Talented Hero Nandu is currently busy with his upcoming project, New director Bix Erusadla is going to handle this film While Bhaskar Basani on ASP Creative arts is bankrolling this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu